కోస్తాకు తుపాను గండం

0
338
12 న కాకినాడ-నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశ ం
రాజమహేంద్రవరం, డిసెంబర్‌  9: బంగాళాఖాతంలో విశాఖపట్టణానికి వేయి కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉంది. ఈ తుపానుకు వార్ధా అని నామకరణం చేశారు. ఇది ఈ నెల 12న కాకినాడ-నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశాలు ఉన్నాయని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో కోస్తా తీరం వెంబడి  రేపటి నుంచి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ఎల్లుండ నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. కొన్ని చోట్ల భారీ నుంచి  అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మత్స్యకారులను చేపల వేటకు సముద్రంలోకి వెళ్ళోద్దని హెచ్చరించారు.