కౌంటింగ్‌ ప్రక్రియ చిత్రీకరణ  

0
180
సజావుగా సాగేందుకు అభ్యర్ధులంతా సహకరించాలి : సబ్‌ కలెక్టర్‌
రాజమహేంద్రవరం,మే 2 : ఈ నెల 23 వ తేదీన నిర్వహించనున్న ఓట్ల లెక్కింపునకు అందరు సహకరించాలని రాజమహేంద్రవరం సబ్‌-కలెక్టర్‌ సి.ఎమ్‌.సాయి కాంత్‌ వర్మ అన్నారు. తన కార్యాలయంలో ఈరోజు రాజమహేంద్రవరం అసెంబ్లీ, పార్ల్లమెంట్‌ ఎన్నికల్లో  పాల్గొన్న వారితో ఓట్లు లెక్కింపుపై సమావేశం ఏర్పాటు చేశారు. కౌంటింగ్‌ ఏజెంట్లుకు పోటీలో ఉన్న అభ్యర్థులు వారి పేర్లు సూచించిన మేరకు గుర్తింపు కార్డులు ఇవ్వడం జరుగుతుందిని తెలిపారు. గుర్తింపు కార్డులు పొందిన వారు ఆరోజు ఉదయం 6 గంటలకు కౌంటింగ్‌ కేంద్రాల వద్ద రిపోర్ట్‌ చేయాలని అన్నారు.రౌండునకు 7 టేబుల్స్‌ ఏర్పాటు చేసి లెక్కించటం జరుగుతుందని అన్నారు. రిటర్నింగ్‌ అధికారి టేబుల్‌ వద్ద 5 వీవీ ప్యాట్ల లెక్కింపు, పోస్టల్‌ బ్యాలెట్‌ కూడా అదే సమయంలో జరుగుతుందని తెలిపారు.కంట్రోల్‌ యూనిట్‌ ఒక సూపర్వైజర్‌, కౌంటింగు అసిస్టెంట్‌, మైక్రో పరీశీలకులు ఉంటారని అన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ లేక్కింపు చోట గెజిటెడ్‌ అధికారి స్థాయి వారిని ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఏజెంట్లు గాని పోటీలో ఉన్న అభ్యర్థులు గాని కెమెరాలు,సెల్ల్‌ ఫోన్లు తీసుకురాకూడదని తెలిపారు. ఎన్నికలు సంఘం నియమ నిబంధనల మేరకు కౌంటింగు ప్రారంభించినప్పటనుండి చివరి వరకు రిటర్నింగ్‌ అధికారి ఏర్పాటు చేసిన వీడియో కెమెరా లెక్కింపును చిత్రీకరిస్తుందని తెలిపారు. ఎవరికైనా సందేహాలు ఉంటే  రిటర్నింగ్‌ అధికారికి తెలియజేయవచ్చునని అన్నారు.అభ్యర్థుల సూచించిన ఏజెంట్లు పేర్లు 5వ తేదీ నాటికి ఇవ్వాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో మాజీ శాసన మండలి సభ్యులు ఆదిరెడ్డి.అప్పారావు,యర్రా వేణుగోపాల రాయుడు, రౌతు వర్మ, నున్న  మోహనరావు చౌదరి, కండవల్లి సోల్మన్‌ రాజు, గరిమెళ్ళ.చిట్టిబాబు, అయ్యల గోపి, కర్రీ సతీష్‌ కుమార్‌, అబ్దుల్‌ రజక, డి.ఎస్‌.పి ఎన్‌.రామారావు, సి.ఐ మూర్తి, అర్బన్‌ తహసీల్దార్‌  కె. శివయ్య, శేఖర్‌  తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here