క్రీడలతో మానసిక ఉల్లాసం

0
303

ఉత్సాహంగా సాగిన అధ్లెటిక్‌ పోటీలు – యర్రా కృషికి ప్రముఖుల ప్రశంసలు

రాజమహేంద్రవరం, జనవరి 29 : రాజకీయాల్లో బిజీగా ఉండే కాపు కార్పొరేషన్‌ డైరెక్టర్‌ యర్రా వేణుగోపాలరాయుడు క్రీడాకారుల కోసం అధ్లెటిక్‌ పోటీలను నిర్వహించడం అభినందనీయమని పలువురు ప్రజాప్రతినిధులు కొనియాడారు. యర్రా రైజింగ్‌ యూత్‌ ఆధ్వర్యంలో ఆర్ట్స్‌ కళాశాల గ్రౌండ్‌లో నిర్వహించిన అధ్లెటిక్‌ పోటీలను సబ్‌ కలెక్టర్‌ సీఎం సాయికాంత్‌వర్మ ప్రారంభించారు. పోటీల ప్రారంభ సూచికగా రూరల్‌ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్యచౌదరి గాలిలోకి బెలూన్‌లు వదిలారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, అర్బన్‌ ఎస్పీ రాజకుమారి తదితరులు పాల్గొని క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం వివిధ క్రీడల్లో పోటీలను ప్రారంభించారు. విద్యార్ధుల్లో క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించేందుకు యర్రా రైజింగ్‌యూత్‌ మంచి కార్యక్రమాన్ని తలపెట్టిందని పలువురు అభినందించారు. పోటీల సందర్భంగా కార్పొరేటర్‌ కొమ్మశ్రీనివాసరావు ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు, దళితరత్న కాశి నవీన్‌కుమార్‌, కార్పొరేటర్లు కిలపర్తి శ్రీనివాస్‌, గాదిరెడ్డి బాబులు, కడలి రామకృష్ణ, తలారి ఉమాదేవి, బెజవాడ రాజ్‌కుమార్‌, ద్వారా పార్వతి సుందరి, బూర దుర్గాంజనేయరావు, పాలిక శ్రీను, గరగ పార్వతి, కోసూరి చండీప్రియ, గొందేశి మాధవీలత, రెడ్డి పార్వతి, కళింగ సూర్యనారాయణ, కో-ఆప్షన్‌ సభ్యురాలు మజ్జి పద్మ, కప్పల వెలుగుకుమారి, తెదేపా నాయకులు మజ్జి రాంబాబు, శెట్టి జగదీష్‌, బుడ్డిగ రాధ, రొబ్బి విజయశేఖర్‌, తవ్వా రాజా, మరుకుర్తి రవి యాదవ్‌, చవ్వాకుల రంగనాధ్‌, మళ్ళ వెంకట్రాజు, పిన్నింటి రవిశంకర్‌, వజ్రనాథ్‌, పడాల శ్రీనివాస్‌, పితాని కుటుంబరావు, జక్కంపూడి అర్జున్‌, మేరపురెడ్డి రామకృష్ణ, గుణపర్తి శివ, నల్లం ఆనంద్‌కుమార్‌, గరగ మురళీకృష్ణ, జాలా మదన్‌, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here