క్రీడల వల్ల విద్యార్ధులకు ఉజ్వల భవిష్యత్తు 

0
227
ఆర్ట్సు కళాశాల మైదానంలో గాండీవ ఎంపికల్లో ప్రజాప్రతినిధులు
రాజమహేంద్రవరం, జులై 24 :  క్రీడల ద్వారా మానసిక ఉల్లాసంతో పాటు పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందని  సిటి శాసనసభ్యులు ఆకుల సత్యనారాయణ, రూరల్‌ శాసనసభ్యులు బుచ్చయ్యచౌదరి, శాసనమండలి సభ్యులు అదిరెడ్డి అప్పారావు, నగర మేయర్‌ పంతం రజనీ శేషాసాయి, గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ, యర్రా వేణుగోపాల్‌ నాయుడు అన్నారు. ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన గాంఢీవ సెలక్షన్‌ కార్యక్రమంలో వారు  పాల్గోన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ విద్యార్దులలో దాగి వున్న క్రీడా నైపుణ్యాన్ని వెలికీతీయడానికి  గాండీవ సెలక్షన్‌ కార్యక్రమం ఎంతగానో తోడ్పడుతుందని అన్నారు. విద్యార్దులకు చదువుతో పాటు క్రీడలు కూడా అవసరమని, 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్దిని, విద్యార్దులు గాండీవ సెలక్షన్‌లో  ప్రతిభ కనబరిచిన వారిని మండల, జిల్లా, రాష్ట్ర స్థాయికి, ఆ తరువాత జాతీయ స్దాయిలో జరిగే పోటిలకు ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేట్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ పి.జీవన్‌ దాస్‌, రాజమహేంద్రవరం జోన్‌ జనరల్‌ సెక్రటరీ జె.రాజ్‌కుమార్‌, అడ్డాల అదినారాయణ మూర్తి, వివిధ పాఠశాలలకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here