క్రీడాకారులను ప్రోత్సహించాలి

0
402
లాలాచెరువులో క్రికెట్‌ టోర్నమెంట్‌ ప్రారంభం
రాజమహేంద్రవరం, జనవరి 13 : నగరంలో ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్‌, నగర కాంగ్రెస్‌ అధ్యక్షులు ఎన్‌.వి.శ్రీనివాస్‌ అన్నారు. గంగాధర్‌ యూత్‌ సర్కిల్‌ ఆధ్వర్యంలో లాలాచెరువులో సమీపాన శశి స్కూల్‌ ఎదురుగా ఉన్న మునిసిపల్‌ గ్రౌండ్‌లో క్రికెట్‌ టోర్నమెంట్‌ ఏర్పాటు చేశారు. ఆదిరెడ్డి వాసు, ఎన్‌.వి.శ్రీనివాస్‌, మాజీ కార్పొరేటర్లు గుత్తుల మురళీధర్‌, అజ్జరపు వాసు తదితరులు టోర్నమెంట్‌ ని ప్రారంభించారు. నగరంలో తరుచుగా క్రికెట్‌ టోర్నమెంట్లు నిర్వహించి క్రీడాభిమానులకు ఉత్సాహం కలిగిస్తున్నారని, భవిష్యత్తులో మరింత మంది ముందుకు వచ్చి క్రీడాకారులను ప్రోత్సహించాలని వారు అన్నారు.ఈ టోర్నమెంట్‌ లో 34 టీమ్‌ లు పాల్గొంటున్నాయని, ప్రతిరోజూ 5 మ్యాచ్‌లు జరుగుతాయని గంగాధర్‌ తెలిపారు. పదిరోజుల పాటు మ్యాచ్‌ల నిర్వాహణ జరుగుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు చాపల చిన్నరాజు, కాంగ్రెస్‌ నాయకులు శ్రీనివాస్‌, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నాయకులు మడగల దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here