క్వారీ గోతులను తక్షణం పూడ్చాలి

0
227
సబ్‌కలెక్టర్‌కు బర్రే కొండబాబు వినతి
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 14 : రాజమహేంద్రవరం శివారు ప్రాంతంలోని క్వారీ గోతులు మృత్యుకుహరాలుగా మారాయని కార్పొరేషన్‌ స్టాండింగ్‌ కమిటీ మాజీ చైర్మన్‌ బర్రే కొండబాబు ఆందోళన వ్యక్తం చేసారు. క్వారీ ఏరియాలోని సుబ్బారావునగర్‌, సింహాచలనగర్‌ను ఆనుకుని ఉన్న క్వారీ గోతుల్లో పడి దాదాపు 20 మంది పిల్లలు మృత్యువాడ పడినా యజమానులు పట్టించుకోవడం లేదని సబ్‌కలెక్టర్‌ డాక్టర్‌ మహేష్‌కుమార్‌ సోమవారం సబ్‌కలెక్టరేట్‌లో జరిగిన స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసారు. ఆ క్వారీ గోతుల్లో తుప్పలు విపరీతంగా పెరిగిఓయిన పాములు చేరుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారన్నారు. ఏళ్ల తరబడి నిలిచిపోయిన నిల్వ నీటితో దోమలు బాగా పెరిగిపోయి డెంగ్యూ, ఫైలేరియా, మలేరియా వంటి విషజ్వరాల బారిన పడి స్థానికులు మత్యువాడ పడుతున్నారని పేర్కొన్నారు. ఈ ప్రాంతాన్ని కబళిస్తున్న ఆ క్వారీ గోతులను పూడ్చాలని దశాబ్ధాలుగా పోరాటం చేస్తున్నామన్నారు. 2000 సంవత్సరంలో లోకాయుక్తలోనూ, 2012లో హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేసామని, అదే విధంగా 2018లో హైకోర్టులో పిల్‌ కూడా వేసామని సబ్‌కలెక్టర్‌కు వివరించారు. హైకోర్టు న్యాయమూర్తి సానుకూలంగా స్పందించి క్వారీ గోతుల్లో పడి చనిపోయిన కుటుంబాలకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని మరో 6 నెలల్లో క్వారీ గోతులను పూడ్చాలని సంబంధిత అధికారులకు 2018లోనే ఆదేశాలు జారీచేసాని ఇప్పటివరకు ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇప్పటికైనా క్వారీ ప్రాంత ప్రజల ఇబ్బందులను అర్థం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని సబ్‌కలెక్టర్‌కు విన్నవించారు. 10 రోజుల్లో ఎలాంటి చర్యలు తీసుకోకపోతే ఉద్యమం ఉధృతం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని కొండబాబు స్పష్టం చేసారు. ఆయన వెంట బర్రే సతీమణి బర్రే మరియ, మాజీ కార్పొరేటర్‌ బర్రే అనుహెలెనియా, స్థానిక మహిళలు మంగ, లక్ష్మి తదితరులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here