ఖాతాదారుల నమ్మకమే పెట్టుబడి

0
299
జాంపేట బ్యాంక్‌ ఎటిఎంను ప్రారంభించిన కమిషనర్‌ సుమిత్‌కుమార్‌
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 11 : ఖాతాదారుల నమ్మకమే బ్యాంకులకు పెట్టుబడి అని, వారి నమ్మకాన్ని నిలబెడుతూ మరిన్ని పదుపాయాలను అందుబాటులోకి తేవాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ సుమిత్‌కుమార్‌ అన్నారు. జాంపేట కో-ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌ నూతనంగా ఏర్పాటు చేసిన ఎటిఎంను ఈరోజు కమిషనర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్యాంక్‌ చైర్మన్‌ బొమ్మన రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ జాంపేట బ్యాంక్‌ ఎటిఎం ద్వారా దేశంలో ఎక్కడైనా డబ్బు తీసుకోవచ్చని, ఏ ఎటిఎంలోనైనా  ఈ కార్డు పనిచేస్తుందన్నారు. ప్రస్తుతానికి  మెయిన్‌బ్రాంచిలోనే ప్రారంభించామని, త్వరలో మోరంపూడి, పెద్దాపురం, కాకినాడ, గోకవరం, ఏలూరులలో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఖాతాదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని కోరారు. ప్రస్తుతం బ్యాంక్‌కు రూ.62 కోట్లు డిపాజిట్లు ఉండగా రూ.118 కోట్లు రుణాలుగా అందించామన్నారు.  ఈ కార్యక్రమంలో బ్యాంక్‌ వైస్‌ చైర్మన్‌ జామిశెట్టి గాంధీ, డైరెక్టర్లు రొబ్బి విజయశేఖర్‌, ద్వారా పార్వతి సుందరి, శీలా రఘుబాబు, కొమ్మన వెంకటేశ్వరరావు, మహంతి లక్ష్మణరావు, ముప్పన శ్రీనివాస్‌, ప్రసాదుల హరనాధ్‌, సేపేని రమణమ్మ, ఆండ్ర నమశ్శివాయ, ప్రొఫెషనల్‌ డైరెక్టర్లు వెంకట్‌ నారాయణ్‌ వేదాంతం, బూరా రామచంద్రరావు, ఇన్‌ఛార్జి సెక్రటరీ నంది భరణీకుమార్‌, సీనియర్‌ సిటిజన్‌ నాయకులు కాసాని శంకరరావు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here