గణపతి నవరాత్రుల్లో గన్ని పూజలు

0
266
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 14: శ్రీరామనగర్‌లో వెలసిన శ్రీ సంకట హర వరసిద్ధి విఘ్నేశ్వరస్వామి ఆలయంలో వినాయకచవితి ఉత్సవాలలో భాగంగా గణపతి మట్టి విగ్రహాన్ని  అలయ ధర్మకర్త, గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ ఆవిష్కరించారు. అనంతరం పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు. ఆ తరువాత పితాని కుటుంబరావు ఆధ్వర్యంలో నారాయణపురంలో, జోగినాయుడు ఆధ్వర్యంలో ఎ.వి.అప్పారావురోడ్‌లో,  జంగా మధు ఆధ్వర్యంలో దానవాయిపేటలో, జాంపేటలోని చేపల మార్కెట్‌లో గొర్రెల రమణ ఆధ్వర్యంలో, అప్సర ధియేటర్‌ వద్ద రెడ్డి మణి, గొర్రెల రమణ ఆధ్వర్యంలో, శెట్టి జగదీష్‌  ఆధ్వర్యంలో నాళం భీమరాజువీధిలో, గోకవరం బస్టాండ్‌ వద్ద రెడ్డి మణి ఆధ్వర్యంలో, మాజీ కార్పొరేటర్‌ ఇసుకపల్లి శ్రీనివాస్‌ ఆధ్వర్యాన లలితానగర్‌లో, మళ్ళ వెంకట్రాజు ఆధ్వర్యాన మునిసిపల్‌ కాలనీ, రత్నంపేటలో జరిగిన వినాయకచవితి వేడుకల్లో గన్ని కృష్ణ పాల్గొని పూజలు చేశారు. గన్ని వెంట రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కాశి నవీన్‌కుమార్‌, సింహాద్రి సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here