గణేష్‌ నిమజ్జనానికి పక్కాగా ఏర్పాట్లు 

0
132
ఉత్సవాల నిర్వాహకులు సహకరించాలి : సబ్‌-కలెక్టరు
రాజమహేంద్రవరం,సెప్టెంబరు 7: గణేశ నిమజ్జనానికి ఉత్సవ కమిటీ సభ్యులు,భక్తులు అందరు సహకరించాలని రాజమహేంద్రవరం సబ్‌-కలెక్టరు ఆర్‌.మహేష్‌ కుమార్‌ కోరారు.స్థానిక సబ్‌-కలెక్టర్‌ కార్యాలయంలో గణేశుని నిమజ్జన ఏర్పాట్లుపై రెవెన్యూశాఖ, పోలీస్‌, విద్యుత్‌, ఇరిగేషన్‌, మత్య, అగ్నిమాపకశాఖ, వైద్యశాఖ, పంచాయతీ శాఖ అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తరపు నుండి  నగరంలో ఇసుక ర్యాంపు(రామక ష్ణ మిషన్‌ సేవ సంస్థ ఎదురుగా)వద్ద, రూరల్‌ ప్రాంతంలో ధవళేశ్వరం రామపాదాల రేవు వద్ద నిమజనానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుందని,ఇక్కడ మాత్రమే నిమజ్జనాలు చేసుకోవాలని అన్నారు. ఈ ఏర్పాట్లు చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు.వినాయక విగ్రహం నిలబెట్టిన దగ్గర నుండి 7 వ రోజు, 9 వ రోజు, 11 వ రోజులలో భక్తులు నిమజ్జనానికి వస్తారని, వారు వచ్చే రూట్లలో ఎటువంటి ఇబ్బందులు కలుగకుండ ఏర్పాట్లు చేయాలని పోలీస్‌ అధికారులకు తెలిపారు. నిమజ్జనానికి గణేశుని విగ్రహాలు తీసుకు వచ్చే సమయాలలో విద్యుత్‌ తీగలు ఆటంకం లేకుండా ఆ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్లంట్లు, క్రేన్లు ఏర్పాట్లు ఇరిగేషన్‌, మునిసిపల్‌ కార్పొరేషన్‌ చూడాలని తెలిపారు.నగరంలో శానిటేషన్‌,త్రాగునీరు,లైటింగ్‌ ఏర్పాట్లు కార్పొరేషన్‌ తీసుకోవాలని,రూరల్‌ ప్రాంతంలో పంచాయతీలు ఏర్పాట్లు చేయాలని తెలిపారు.నిమజ్జనం వద్ద ఫాంట్లు వద్ద గజ ఈతగాళ్లను, లైఫ్‌ జాకెట్లు ఏర్పాటు చేయాలని అన్నారు. నిమజ్జన సమయాలలో గోదావరి వరద నీరు ఎక్కువగా ఉంటే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. భక్తులు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు పడకుండ మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్‌.పి.లత మాధురి,డి.ఎస్‌.పి.లు పి.సత్యన్నారాయణ,ఎస్‌.వెంకటరావు,సంతోష్‌,కార్పొరేషన్‌ అధికారులు ఓం ప్రకాష్‌,పాండురంగ రావు, వినూత్న, అదనపు వైద్య ఆరోగ్యశాఖాధికారి  పి.కోమలి, డివిజన్‌ పంచాయతీ అధికారి టి.సత్యనారాయణ,విద్యుత్‌ శాఖ ఏఈ శిరీష్‌,ఇరిగేషన్‌ శాఖ ఈఈ ఆర్‌.మోహన్‌ రావు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here