గన్ని కృష్ణ సేవలు స్ఫూర్తిదాయకం 

0
351
గిరిజన గ్రామంలో ఉచిత వైద్య శిబిరానికి అనూహ్య స్పందన
భారీ ఎత్తున మందుల పంపిణీ
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 19 : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్ఫూర్తితో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి గన్ని కృష్ణ దత్తత తీసుకున్న  గిరిజన గ్రామం దేవీపట్నం మండలం ఫజుల్లాబాద్‌ (పెదభీంపల్లి)లో ఆదివారం స్పందన సేవా సంస్థ, ఎన్‌టిఆర్‌ ట్రస్ట్‌, జిఎస్‌ఎల్‌ మెడికల్‌ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం విజయవంతంగా జరిగింది. ఈ వైద్య శిబిరాన్ని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ నామన రాంబాబు ప్రారంభించగా మాజీ ఎమ్మెల్యేలు శీతంశెట్టి వెంకటేశ్వరరావు, చిన్నం బాబూ రమేష్‌, జి.ఎస్‌.ఎల్‌. మెడికల్‌ కళాశాల చైర్మన్‌ డాక్టర్‌ గన్ని భాస్కరరావు, పెద్దాడ నవీన్‌, డాక్టర్‌ సాధిక,  ఎఓ శ్రీనివాస్‌, ఎన్‌టిఆర్‌ ట్రస్ట్‌ ప్రతినిధి శ్రీరామమూర్తి పర్యవేక్షించారు. దాదాపు వెయ్యిమందికి పైబడి ప్రజలు సమీప గ్రామాల నుండి పెద్ద ఎత్తున తరలి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకుని మందులు స్వీకరించారు. పరీక్షల్లో వచ్చిన రిపోర్టుల మేరకు వందమందికి పైబడిన పేషెంట్లను తదుపరి చికిత్స కోసం ఉచితంగా జిఎస్‌ఎల్‌ ఆసుపత్రికి రిఫర్‌ చేశారు. ఈ శిబిరంలో ఇసిజి, దంత శిబిరాల వద్ద ప్రజలు బారులు తీరారు. జిఎస్‌ఎల్‌ మెడికల్‌ కళాశాలలో నూతనంగా ప్రారంభించిన డెంటల్‌ కళాశాలకు సంబంధించిన వైద్యులు అక్కడ సేవలందించారు. డెంటల్‌ వైద్యానికి సంబంధించిన మొబైల్‌ ఆసుపత్రిని ఆ ప్రాంతానికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా నామన రాంబాబు తదితరులు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు స్ఫూర్తితో గ్రామాన్ని దత్తత తీసుకోవడమే కాకుండా గిరిజనుల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా గన్ని కృష్ణ కృషి చేయడం అభినందనీయమన్నారు. మారుమూల గ్రామానికి ప్రముఖ వైద్యులను, అత్యాధునిక వైద్య పరికరాలను తీసుకు రావడం సామాన్యమైన విషయం కాదని, మాటలు కన్నా చేతల్లో చేసి చూపించడం గన్ని కృష్ణ ప్రత్యేకత అన్నారు. గ్రామ అభివృద్ధికి తమ వంతు కృషిచేస్తామని హామీనిచ్చారు.  వైద్య శిబిరాలలో పరీక్షలు చేయించుకున్న ప్రజలకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ మెడికల్‌ క్యాంపు నిర్వహణలో దళితరత్న కాశి నవీన్‌కుమార్‌,  మళ్ళ వెంకట్రాజు, ఉప్పులూరి జానకిరామయ్య, మజ్జి రాంబాబు, కరుటూరి అభిషేక్‌ బృందాలు సేవలందించాయి. డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు, ఫ్లోర్‌ లీడర్‌ వర్రే శ్రీనివాసరావు, ఆచంట బాలాజీ, బి.వి.ఎం.మురళి, మొల్లి చిన్ని యాదవ్‌, రమేష్‌, హుస్సేన్‌ ఆలీ జానీ, జింకల జయదేవ్‌, కోట కామరాజు, దొడ్డా విజయ్‌, ప్రముఖ న్యాయవాది చింతపల్లి శ్రీనివాస్‌, మజ్జి సోమేశ్వరరావు, వానపల్లి శ్రీను, రషీద్‌, శనివాడ అర్జున్‌, విశ్వనాథరాజు, ఉప్పులూరి కాశీ విశ్వనాథం, మరుకుర్తి తాతబ్బాయి, వంకా శ్రీనివాసచౌదరి, కవులూరి వెంకట్రావు, కొత్తూరి బాల నాగేశ్వరరావు, నేమాని పట్టాభి, శ్రీనివాస్‌ కాపు, ముత్యాల ప్రకాశరావు, కె.ఎస్‌.ప్రకాశరావు, మార్ని సురేష్‌, జాలా మదన్‌, శ్రీనివాస్‌, నాని, శ్రీరామ్‌, వాసు సహకారం అందించారు. దేవీపట్నం మండల నాయకులు, హైస్కూల్‌ విద్యార్ధులు విచ్చేసి శిబిర నిర్వహణకు తోడ్పాటునందించారు.