గన్ని కృష్ణ సేవల్ని గుర్తించండి.. పార్లమెంట్‌ టిక్కెట్‌ ఇవ్వండి 

0
920
తెదేపా అధినేతను ముక్తకంఠంతో కోరిన నాయకులు, కార్పొరేటర్లు
రాజమహేంద్రవరం, మార్చి 12 : రాజమహేంద్రవరం పార్లమెంట్‌ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ టిక్కెట్టును గుడా చైర్మన్‌ గన్ని క ష్ణకు  కేటాయించాలని పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్పొరేటర్లు కోరారు.  ఈ విషయమై తెదేపా జాతీయ అధ్యక్షులు, సీిఎం చంద్రబాబుని కలిసి విన్నపాన్ని అందించేందుకు సిద్ధమవుతున్నామని వారు తెలిపారు. గోదావరి గట్టున ఉన్న వైఎంవిఎ హాల్‌లో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో నగర తెదేపా ప్రధాన కార్యదర్శి, పిఎంకె చౌల్ట్రీ చైర్మన్‌ రెడ్డి మణి, మాజీ కార్పొరేటర్‌ కురగంటి సతీష్‌, ఎస్సీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కాశి నవీన్‌కుమార్‌, కార్పొరేటర్లు గొందేశి మాధవీలత, యిన్నమూరి రాంబాబు, మార్కండేయేశ్వరస్వామి ఆలయ చైర్మన్‌ మజ్జి రాంబాబు, సింహ నాగమణి, పార్టీ నాయకులు ఉప్పులూరి జానకిరామయ్య తదితరులు మాట్లాడారు. గత 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ ఏ బాధ్యత అప్పగించినా, ఏ నియోజకవర్గంలో పనిచేసి అభ్యర్థులుగా గెలిపించమని ఆదేశించినా తూచా తప్పకుండా పార్టీ ఆదేశాలను శిరసావహిస్తు గన్ని వచ్చారన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి నమ్మకంగా, విధేయతగా గన్ని క ష్ణ పని చేస్తున్నారని పేర్కొన్నారు. స్థానికులైన వారికే అవకాశం కల్పిస్తే పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని పార్టీనాయకులు, కార్యకర్తలు కష్టపడి మరింత ఉత్సాహంగా పనిచేస్తారన్నారు. ఎంపి అభ్యర్ధిగా గన్ని  పేరు పరిశీలనలోకి రాగానే అన్ని వర్గాల్లో ఆనందం కలిగిందన్నారు. రాజమహేంద్రవరం పార్లమెంట్‌ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలతో, నాయకులతో సత్సంబంధాలు కలిగిన నాయకుడన్నారు. ప్రత్యేక ¬దా, విభజన చట్టంలోని అంశాలు అమలుకావాలంటే పార్లమెంట్‌లో గళం గట్టిగా వినిపించాలన్నా, రాజమహేంద్రవరం పార్లమెంట్‌ నియోజకవర్గం అభివ ద్ధి చెందాలన్నా ఆయనకే అవకాశం ఇవ్వాలని కోరారు. రాజమహేంద్రవరం రూరల్‌ నుంచి గోరంట్ల బుచ్చియ్యచౌదరికి, సిటీ నియోజకవర్గం నుంచి ఆదిరెడ్డి భవానీకి అసెంబ్లీకి పోటీచేసే అవకాశం ఇచ్చిన పార్టీ అధిష్టానం గన్నికి పార్లమెంట్‌ అవకాశం ఇచ్చేలా ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేసారు. తదుపరి గన్ని కృష్ణ తీసుకునే నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు కడలి రామకృష్ణ, పితాని లక్ష్మీ కుమారి, కోరుమిల్లి విజయశేఖర్‌, తంగెళ్ల బాబీ, సింహ నాగమణి, బెజవాడ రాజ్‌కుమార్‌, గాదిరెడ్డి పెదబాబు, కొమ్మ శ్రీనివాస్‌, మర్రి దుర్గా శ్రీనివాస్‌, పాలవలస వీరభద్రం, కో-ఆప్షన్‌ సభ్యులు మజ్జి పద్మ, కప్పల వెలుగుకుమారి, పార్టీ నాయకులు  బుడ్డిగ రాధా, శ్రీ ఉమా కోటిలింగేశ్వరస్వామి దేవస్థానం చైర్మన్‌ అరిగెల బాబూ నాగేంద్రప్రసాద్‌, కంటిపూడి శ్రీనివాస్‌, గొర్రెల రమణ, చిట్టూరి ప్రవీణ్‌చౌదరి, మజ్జి శ్రీనివాస్‌, మరుకుర్తి రవి యాదవ్‌, కూరాకుల తులసి,  నల్లం శ్రీను, బెజవాడ వెంకటస్వామి, మళ్ల వెంకట్రాజు,  కవులూరి వెంకట్రావు, విశ్వనాధరాజు, జక్కంపూడి అర్జున్‌, శనివాడ అర్జున్‌, నల్లం ఆనంద్‌, పితాని కుటుంబరావు, జి.కొండబాబు, కాట్రు లక్ష్మణస్వామి, కాట్రు రమణకుమారి, దమర్‌సింగ్‌ బ్రహ్మాజీ, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here