గవర్నర్‌ దృష్టికి ‘సుందర్‌ భారత్‌’ ప్రాజెక్టు 

0
162
నివేదించిన బిజెపి నాయకురాలు కొల్లివెలసి హారిక
రాజమహేంద్రవరం, జనవరి29: గ్రామీణ ప్రాంతాల్లోనిదేవాలయాలు,  పార్కులు, ప్రకృతి రమణీయ దృశ్యాలు వున్న ప్రాంతాలు, సరస్సులను అభివృద్ది చేయడం ద్వారా సుందర్‌ భారత్‌గా అభివృద్ది చేయటంపై బిజెపి నాయకురాలు కొల్లివెలసి హారిక ఒక ప్రాజెక్టును రూపొందించి రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు అందచేశారు. కేంద్రప్రభుత్వం స్వచ్చభారత్‌ను చేపట్టిన మాదిరిగానే సుందర్‌భారత్‌కు ఒక సంస్ధను ఏర్పాటు చేసి నిధులను సమకూర్చి దేవాలయాలు, పార్కులు, సరస్సును ఎక్కడికక్కడ అభివృద్ది చేయకలిగితే  సహజవనరులు వున్న గ్రామీణ ప్రాంతాలు పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ది చెందుతాయని ఆమె తెలిపారు. ఎంతో ప్రాముఖ్యత కలిగిన ప్రకృతి రమణీయ దృశ్యాలు వున్న ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్‌లో చాలా వున్నాయని, చారిత్రక ప్రాశస్త్యం కలిగిన దేవాలయాలు కూడా అభివృద్దికి నోచుకోకుండా వున్నాయని, వాటి అభివృద్ది కోసం ప్రయోగాత్మకంగా ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ది చేయాలని ఆమె కోరారు. విజయవాడలో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను కొల్లివెలసిహారిక బుధవారం కలిసారు. సుందర్‌ భారత్‌ ప్రాజెక్టుపై కొల్లివెలసి హారిక తెలియచేసిన వివరాలను ఆయన ఆసక్తిగా తెలుసుకున్నారు. సమగ్రమైన వివరాలతో నివేదికను అందచేయాలని ఆయన సూచించారు. కొల్లివెలసి హారికతో పాటు కొల్లివెలసి మనీషా కూడా గవర్నర్‌ను కలిసారు. సుందర్‌భారత్‌ ప్రాజెక్టుకు సంబంధించి సమగ్రమైన వివరాలతో ప్రాజెక్టును ఉచితంగా తాను తయారు చేస్తానని  కొల్లివెలసి హారిక కుమార్తె కొల్లివెలసి మనీషా గవర్నర్‌కి తెలియచేశారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్‌ చదువుతున్నానని, తనకు వీటిపై ఎంతో ఆసక్తి వుందని ఆమె గవర్నర్‌కి తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here