గాంధీజీ ఆశయాల మేరకు పాలన చేస్తున్న  మోడీ 

0
80
రూరల్‌ నియోజక వర్గ బిజెపి  సంకల్ప్‌ యాత్రలో సోము వీర్రాజు
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 16 :   గాంధీజీ ఆశయాల మేరకు  ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నో పధకాలను అమలు చేస్తూ  పాలన చేస్తున్నారని  ఎమ్మెల్సీ , బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు అన్నారు.  భారతీయ జనతా పార్టీ కేంద్ర రాష్ట్ర పార్టీల పిలుపుమేరకు దేశ  వ్యాప్తంగా అన్ని పార్లమెంట్‌ నియోజక వర్గాల పరిధిలో  జరుగుతున్న మహాత్మా గాంధీ సంకల్ప యాత్ర రాజమండ్రి రూరల్‌ మండలంలో  నిర్వహించారు. గాంధీజీ ఆశయం మేరకు స్వచ్ఛ భారత్‌,ఖాదీ వస్త్ర ధారణ, స్వదేశీ,స్థానిక ఉత్పత్తుల ప్రోత్సహం,పర్యావరణ పరిరక్షణ ,స్థానిక సమస్యల ప్రస్తావన తదితర అంశాలతో పాటు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పధకాలను ప్రజలకు చేరువ చేసే దిశగా నిర్వహిస్తున్న ఈ  యాత్ర కు  జిల్లా యాత్ర ప్రముఖ్‌ గా  పురవస్తు సత్య గోపీనాద్‌ దాస్‌ వ్యవహరిస్తున్నారు. ఆయన సారధ్యంలో నిన్నటి రోజున రాజమండ్రిలో ప్రారంభమైన సంకల్ప్‌ యాత్ర   బుధవారం ఉదయం రూరల్‌ మండలంలో జరిగింది.  ధవళేశ్వరం సాయిబాబా గుడి దగ్గర మొదలైన ఈ యాత్ర  కడియం మండలం మురమండ గ్రామం వరకు కొనసాగింది.  ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా  సోము వీర్రాజు, జిల్లా అధ్యక్షులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య పాల్గొన్నారు. ఈసందర్బంగా  సోము వీర్రాజు మాట్లాడుతూ ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ పరిపాలనలో దేశం అనేక మైలురాళ్లను దాటిందని గ్రామాల అభివ ద్ధికి కట్టుబడి ఉందని అయన అన్నారు. అనేక కీలక నిర్ణయాలు తీసుకుని ప్రజల మన్ననలు పొందిందని తెలిపారు. సత్యగోపినాధ్‌ దాస్‌ సారధ్యంలో  150 కిలోమీటర్ల పాదయాత్రను జిల్లాలో  విజయవంతంగా పూర్తి చేయబోతున్నారని పేర్కొంటూ  వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈకార్యక్రమంలో గుర్రాల వెంకట్రావు, యానపు యేసు, కర్రి నాగిరెడ్డి కోన సతీష్‌, పన్నాల వెంకటలక్ష్మి ఆకుల శ్రీధర్‌, కొల్లి అనిల్‌, కటికలపూడి వెంకటేశ్వరరావు,వంటెద్దు స్వామి ధనాల రామలక్ష్మి తనుబుద్ది సూర్య భాస్కరరావు, కర్రి రాజారెడ్డి, అచారి, కండిల్లి సురేష్‌, పాలివేల వాణి, కెర నూకరత్నం, తుమ్మల సత్యవతి, పిల్లి శ్రీను కంపెళ్ల గంగరాజు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here