గాంధీజీ సూచించిన అహింసా మార్గంలో పయనిద్దాం

0
190
గాంధీజీ విగ్రహావిష్కరణలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 2 : అహింసే ఆయుధంగా బ్రిటిషర్లతో పోరాడిన గొప్ప నాయకుడు మహాత్మా గాంధీజీ అని రాజమహేంధ్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్‌ అన్నారు. గాంధీ 150వ జయంతి సందర్భంగా స్థానిక దానవాయిపేటలోని చిన్న గాంధీ బొమ్మ సెంటర్‌లో పునం ప్రతిష్టించిన విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్‌ ముఖ్య అతిధిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు. అలాగే మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి యర్రా వేణు గోపాలరాయుడు, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు) తదితరులు గాంధీజీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే భవానీ మాట్లాడుతూ గాంధీజీ చూపిన పోరాట మార్గం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. 250 ఏళ్లకుపైగా బ్రిటిష్‌ పాలనలో మగ్గిన భారతావని స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడానికి మహాత్ముడు చూపిన పోరాట పంథానే కారణమన్నారు. గోపాల కృష్ణ గోఖలే పిలుపుతో గాంధీజీ 1915లో దక్షిణాఫ్రికా నుంచి భారత్‌ తిరిగి వచ్చి మిగతా స్వాతంత్రోద్యమ నాయకులతో కలిసి బ్రిటిషర్లు భారత్‌ వదిలి వెళ్లేంత వరకు పోరాటం చేశారని అన్నారు. ఆయన చూపించిన అహింసా మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ దానవాయిపేటలోని చిన్న గాంధీ బొమ్మ సెంటర్‌కు ప్రత్యేక స్థానం ఉందని, అయితే ఆ ప్రాంతంలోని గాంధీ బొమ్మ శిధిలమైందని స్థానికులు చెప్పడంతో స్పందించి కొత్త విగ్రహాన్ని చేయించి యదాస్థానంలో ఏర్పాటు చేశామన్నారు. భారతీయులందరిచే ఆదరింపబడే ఒక గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు గాంధీజీ అని అన్నారు. సత్యం, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలని, సహాయ నిరాకరణ, సత్యాగ్రహము ఆయన ఆయుధాలన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి యర్రా వేణు గోపాలరాయుడు మాట్లాడుతూ సత్యం, అహింసా మార్గాల్లో పయనించిన గాంధీజీ మార్గాన్ని అందరూ అనుసరిస్తే దేశంలో శాంతి భద్రతలు ఉంటాయన్నారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు) మాట్లాడుతూ  1948లో మేడూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహాం ధ్వంసం కావడంతో అదే స్థానంలో తమ ఆధ్వర్యంలో విగ్రహాన్ని పునం ప్రతిష్టించడం తమ కుటుంబం చేసుకున్న అద ష్టమన్నారు. గాంధీజీ నడిన శాంతి మార్గంలోనే అందరూ పయనించాలన్నారు. ఆయన ఆలోచనలు ఆదరణీయమని, అందరూ ఆయన బాటలో పయనించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు, డిప్యూటీ మాజీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు, కోరుమిల్లి విజయశేఖర్‌, గుబ్బల రాంబాబు, విక్రమ్‌ జైన్‌, కడలి రామకృష్ణ, పితాని కుటుంబరావు, నక్కా దేవి, తలారి భగవాన్‌, కోసూరి చండీప్రియ, కంటిపూడి రాజేంద్రప్రసాద్‌, ఉప్పులూరి కాశి విశ్వనాధ్‌, పాలిక శ్యామ్‌, తంగేటి సాయి, కర్రి రమణమ్మ, కొమ్మా శ్రీనివాస్‌, నల్లం ఆనంద్‌, బెజవాడ రాజ్‌కుమార్‌, కర్రి కాశి, రెడ్డి పార్వతి, కరగాని వేణు, పెనుగొండ రామకృష్ణ, అరిగెల బాబు, బుడ్డిగ రవి, బుడ్డిగ గోపాలకృ ష్ణ, గొర్రెల రమణి, నాయుడు, సింహా నాగమణి, మర్రి దుర్గా శ్రీనివాస్‌, కంటిపూడి శ్రీనివాస్‌, కొయ్యల రమణ, ధనరాజ్‌, మరుకుర్తి రవి యాదవ్‌, సత్తి వెంకట సాయి సందీప్‌, దాస్యం ప్రసాద్‌, సందక లక్ష్మణరావు, మురళి, యాళ్ల ప్రదీప్‌, యాళ్ల వెంకటరావు, మళ్ల వెంకటరాజు, జోగి నాయుడు, సలాది ఆనంద్‌, మహబూబ్‌ ఖాన్‌, మహబూబ్‌ జానీ, అప్సరీ, జోగి నాయుడు, ధర్మ, మానే దొరబాబు, బ్రహ్మాజీ, తురకల నిర్మల తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here