గీతా శాస్త్రి కన్నుమూత

0
79

రాజమహేంద్రవరం,నవంబర్‌ 7 : గీతా ఫిలింస్‌ తూర్పుగోదావరి జిల్లా డిస్ట్రిబ్యూటర్స్‌ మేనేజర్‌ చావలి వెంకట సీతారామ శాస్త్రి (గీతా శాస్త్రి) (65) గురువారం తుదిశ్వాసను విడిచారు. నగరంలోని దానవాయిపేటలోని శ్రీనివాస అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న ఆయన గురువారం ఉదయం కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. గురువారం సాయంత్రం ఆయన పార్థివదేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే తూర్పుగోదావరి జిల్లా ఫిలిం డిస్ట్రిభ్యూటర్స్‌ ప్రతినిధులు చల్లా శంకర రావు, అనుశ్రీ సత్యనారాయణ, జెకె రామకృష్ణ, నెక్కంటి రామ్మోహనరావు, రాధాకృష్ణ. ఎంఎల్‌ మూవీస్‌ పండు, రంగయ్య, వింటేజ్‌ ప్రసాద్‌, హరిబాబు, ఇష్ణో రాజు, చీకట్ల సత్యనారాయణ, అన్నపూర్ణ రాజు, గీత వెంకటేశ్వరరావు, రాజు, వేణు, ఎర్ర శ్రీను ఆయన పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. అలాగే మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు ఆయన స్వగృహానికి వెళ్లి శాస్త్రి పార్థివదేహానికి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here