గుడా నిధులతో భీమేశ్వరస్వామి ఆలయ రహదారిలో సెంట్రల్‌ లైటింగ్‌  

0
234
శంకుస్థాపన చేసిన చైర్మన్‌ గన్ని కృష్ణ
సామర్లకోట, జనవరి 3 : అభివృద్ధి పనులతో పాటు జిల్లాలోని ప్రసిద్దమైన దేవాలయాల వద్ద భక్తుల సౌకర్యార్ధం నిధులు కేటాయించి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ అన్నారు. పంచారామ క్షేత్రాల్లో ఒకటైన సామర్లకోట కుమారారామ భీమేశ్వరస్వామి ఆలయం వద్ద  రూ.40 లక్షలతో భక్తుల సౌకర్యార్ధం గుడా నిధులతో సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేసేందుకు  గురువారం గన్ని కృష్ణ , డైరెక్టర్లు, అధికారులు శంకుస్థాపన చేశారు.  చైర్మన్‌ గన్ని కృష్ణ, డైరెక్టర్లు గట్టి సత్యనారాయణ, ఎలిశెట్టి నాని,పిల్లి రవికుమార్‌, వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఆర్‌.అమరేంద్రకుమార్‌, చినరాజప్ప తనయుడు రంగనాగ్‌ తదితరులు పాల్గొని  భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా గన్ని కృష్ణ మాట్లాడుతూ భీమేశ్వరస్వామి ఆలయానికి అనేక ప్రాంతాల నుండి భక్తులు తరలి వస్తారని, వారి సౌకర్యార్ధం రూ.40 లక్షలు కేటాయించి సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు  చేస్తున్నామన్నారు. గుడా ద్వారా వివిధ నియోజకవర్గాలలో అభివృద్ధి పనులు చేస్తూ సిఎం ఆలోచనలకు అనుగుణంగా నడుస్తున్నామని,అభివృద్ధి పనులు వేగవంతంగా చేయాలని కోరారు.ఆలయం వద్ద రూ.40 లక్షలతో సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేయడంపై ఆలయ చైర్మన్‌ జగదీష్‌ మోహన్‌, ఆలయ ఈఓ నారాయణమూర్తి తదితరులు గుడా పాలకమండలికి కృతజ్ఞతలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here