గురుతరమైన బాధ్యత మీదే 

0
166
ఏరియా కో-ఆర్డినేటర్లు, బూత్‌ కమిటీ కన్వీనర్లకు తెదేపా శిక్షణ
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 14 : రానున్న ఎన్నికల్లో ఏరియా కో-ఆర్డినేటర్లు, బూత్‌ కమిటీ కన్వీనర్లదే గురుతరమైన బాధ్యత అని గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. 1 నుంచి 12 డివిజన్లకు చెందిన బూత్‌ కమిటీ కన్వీనర్లు, ఏరియా కో-ఆర్డినేటర్లతో జె.ఎన్‌.రోడ్‌లోని రాజమహేంద్రవరం పార్లమెంట్‌ శిక్షణా కేంద్రంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గన్ని, ఆదిరెడ్డి మాట్లాడుతూ నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసి తెదేపా ప్రభుత్వాన్ని బలపరిచేలా ప్రతి ఒక్కరూ నడుం బిగించాలన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అలసత్వం వహించకుండా అప్రమత్తంగా ఉండాలని, చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాల కోసం చేస్తున్న కృషిని అందరికీ వివరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శాప్‌ డైరెక్టర్‌ యర్రా వేణుగోపాలరాయుడు,  డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు, జీవకారుణ్య సంఘం చైర్మన్‌ వర్రే శ్రీనివాసరావు, మినిమమ్‌ వేజెస్‌ బోర్డు డైరెక్టర్‌ నక్కా చిట్టిబాబు, పార్టీ నాయకులు మజ్జి రాంబాబు, ఆదిరెడ్డి వాసు, కార్పొరేటర్లు కోసూరి చండీప్రియ, కోరుమిల్లి విజయశేఖర్‌, కడలి రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here