గుర్తింపు కార్డు చూపిస్తేనే వివరాలు చెప్పండి 

0
220
నగర ప్రజలకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి సూచన
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 3 : మేము రాష్ట్ర ప్రభుత్వం చేత నియమించబడిన వాలంటీర్లము, మీ వివరాలు మాకు కావాలి, మీ ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు, బ్యాంకు వివరాలు మాకు చెప్పండి నమోదు చేసుకుంటాం అంటూ ఎవరైనా మీ వద్దకు వస్తే ముందుగా వారిని గుర్తింపు కార్డు అడగాలని నగర ప్రజలకు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని శ్రీనివాస్‌ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. గుర్తింపు కార్డులు చూపించకుండా నగరంలో కొంతమంది ఇలాంటి వివరాలు సేకరించి వారి బ్యాంకు ఖాతా నుంచి నగదును అపహరిస్తున్న నేపథ్యంలో తప్పనిసరిగా గుర్తింపు కార్డు చూపిస్తేనే వివరాలు తెలపాలని కోరారు. గుర్తింపు కార్డు చూపించకుండా ఎవరైనా మీ వ్యక్తిగత వివరాలు అడిగితే మీ దగ్గరలోని పోలీస్‌ స్టేషన్లో సదరు వ్యక్తులను అప్పగించి ఫిర్యాదు చేయాలని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here