గృహ లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలకు తావుండదు

0
286
అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు చేరువ చేస్తాం – ఉత్సాహంగా నగర దర్శిని
రాజమహేంద్రవరం, జులై 28 : అర్హులైన ప్రతి ఒక్కరికి గ హాలు మంజూరు చేస్తామని, లబ్దిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవకలకు చోటు ఉండబోదని గుడా చైర్మన్‌ గన్ని క ష్ణ, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. స్ధానిక 6వ డివిజన్‌లో తెలుగుదేశం పార్టీ నగరదర్శిని కార్యక్రమాన్ని రెండోరోజూ కొనసాగించారు. ముందుగా ఎన్‌.టి.ఆర్‌. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గన్ని క ష్ణ మాట్లాడుతూ ఆరవ డివిజన్‌లో చేపట్టిన నగర దర్శినిలో అందరూ చంద్రబాబు పాలనపై సంత ప్తి వ్యక్తం చేసారని, అయితే సొంత గ హం కోసం విజ్ఞాపనలు ఎక్కువగా వచ్చాయని అన్నారు. సిఎం చంద్రబాబు పేద, మధ్య తరగతి ప్రజల ఇబ్బందులను ద ష్టిలో పెట్టుకుని ఇటీవలే మూడు లక్షల గ హాల నిర్మాణానికి శంకుస్థాపన చేసారని, ఈ ఏడాది చివరి నాటికి 19 లక్షల గ హాలను ప్రజలకు అందించేందుకు క షి చేస్తున్నారని తెలిపారు. రాజమహేంద్రవరంలో స్ధలాలు లేనందున రూరల్‌ నియోజకవర్గంలో స్ధలాలు గుర్తించి గ హ నిర్మాణాలు చేపట్టారని అన్నారు. గత ప్రభుత్వం హయాంలో గ హాల మంజూరులో అవకతవకలు జరిగాయని, ఇప్పుడు అలాంటి వాటికి తావు లేకుండా పారదర్శకంగా అందించడం జరుగుతుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఫించన్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. వై.ఎస్‌. హయాంలో కేంద్రం ప్రభుత్వం ఫించన్‌ నిమిత్తం రూ.400 రాష్ట్రానికి ఇవ్వగా అందులో రూ. 200 మాత్రమే ఇచ్చేవారని, ఇప్పుడైతే కేంద్రం ఇస్తున్న రూ.400 ఇస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం దానికి రూ.600 కలిపి అందిస్తుందన్నారు. రాష్ట్రం ఆర్ధిక లోటులో ఉన్నా పేదవాడి సంక్షేమమే లక్ష్యంగా చంద్రబాబు పని చేస్తున్నారని తెలిపారు. ఇటీవల జగన్‌, పవన్‌లు ఒకరిపై ఒకరు చేసుకున్న విమర్శలు కేవలం నాటకాలేనని, బిజెపి నేతలు ఆడిస్తున్నట్టుగా వీరు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈరోజు ఒంగోలులో సిఎం చంద్రబాబునాయుడు ధర్మపోరాట దీక్ష చేస్తుంటే పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న పవన్‌ కళ్యాణ్‌ అకస్మాత్తుగా అమరావతిలో రైతుల కోసం ధర్నా చేయడం వెనుక ఆంతర్యం అందరికి తెలుసన్నారు. చంద్రబాబుకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఇలాంటి జిమ్మిక్కులను మోడి ఆడిస్తున్నారన్నారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ నిత్యం ప్రజల కోసం పనిచేసే పార్టీ ఒక్క తెలుగుదేశమేనని, అందువల్లే అధికారంలో ఉన్నా ఏదో ఒక కార్యక్రమం ద్వారా ప్రజలతో మమేకం అవుతూ పధకాలను అర్హులకు చేరువ చేస్తున్నామన్నారు. సిఎం చంద్రబాబు ఎప్పుడూ పేద ప్రజల సంక్షేమం కోసం పని చేస్తారని, గత నాలుగేళ్ళలో ఎన్నో సంక్షేమ పధకాలు అమలు చేసారని తెలిపారు. నగర దర్శిని కార్యక్రమంలో ఇంటింటికి వెళ్తున్నప్పుడు ప్రజలు పూర్తి స్థాయిలో సంత ప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.ఇంకా పధకాలు పొందని వారి కోసమే ఈ కార్యక్రమాన్బి నిర్వహిస్తున్నామన్నారు. శాప్‌ డైరెక్టర్‌ యర్రా వేణుగోపాలరాయుడు మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా చంద్రబాబు ఎన్నో పధకాలు ప్రవేశపెట్టారని, వాటిని అర్హులకు చేర్చడం కోసం వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజల్లోనే ఉంటున్నామన్నారు.ఎన్నికల్లో చెప్పినట్లు ప్రతి పేద ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటున్నారని అన్నారు. దేశంలో ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే జవాబుదారీగాతనంగా వ్యవహరిస్తుందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అనుభవం, పరిపక్వత లేని జగన్‌, పవన్‌ లు సిఎం కుర్చీకోసం ఆరాటపడుతున్నారని విమర్శించారు. ఆర్యాపురం బ్యాంక్‌ చైర్మన్‌ చల్లా శంకర్రావు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న  పధకాలను సద్వినియోగపరచుకోవాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో మళ్ళీ చంద్రబాబుని సిఎం చేస్తేనే రాష్ట్రం దేశంలో అగ్రగామిగా నిలుస్తుందన్నారు. నగర అధ్యక్షుడు వాసిరెడ్డి రాంబాబు, ఆరవ డివిజన్‌ తెదేపా అధ్యక్షుడు మజ్జి రాంబాబు మాట్లాడుతూ  విభజన తరువాత చంద్రబాబు సిఎం కావడం వల్లే రాష్ట్రం ప్రగతి పధంలో నడుస్తుందని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రజా సంక్షేమానికి ఎక్కడా ఢోకా లేకుండా క షి చేస్తున్నారని తెలిపారు. అనంతరం ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పధకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కాశి నవీన్‌ కుమార్‌, పార్టీ నాయకులు బుడ్డిగ రాధా, కార్పొరేటర్లు బెజవాడ రాజ్‌ కుమార్‌, కోరుమెల్లి విజయశేఖర్‌, కడలి రామక ష్ణ, ద్వారా పార్వతి సుందరి, పార్టీ నాయకులు బొమ్మనమైన శ్రీను, పితాని కుటుంబరావు, మహబూబ్‌ జానీ, మళ్ళ వెంకట్రాజు, మజ్జి సోమేశ్వరరావు, కర్రి రాంబాబు, పీతా క ష్ణమూర్తి, పోలాకి రమేష్‌, మేరపురెడ్డి రామక ష్ణ, శీలం గోవింద్‌, శనివాడ అర్జున్‌, దమర్‌ సింగ్‌ బ్రహ్మాజీ, పుట్టా సాయిబాబు, వానపల్లి శ్రీనివాసరావు, నందిగాని మురళీక ష్ణ, పోసుపో శేఖర్‌, ఎం.ఎ.రషీద్‌, పల్లి సాయి, చిన్నారి ఉమామహేశ్వరరావు, తలారి భాస్కర్‌, మధు వరప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here