గోదావరిలో దూకిన మహిళను కాపాడిన ఎస్‌ఐ ఆనంద్‌

0
1340
రాజమహేంద్రవరం, ఆగస్టు 17 : అనారోగ్యం కారణంగా గోదావరిలో దూకబోయిన మహిళను త్రీటౌన్‌ ఎస్‌ఐ ఆనంద్‌ చొరవతో గజ ఈతగాళ్ళు కాపాడారు. వివరాలలోకి వెళితే స్థానిక కోటిలింగాలఘాట్‌లో వరద ఉధృతి కారణంగా ఎస్‌ఐ ఆనంద్‌, సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో కోరుకొండకు చెందిన  మన్యం ఈశ్వరి అనే మహిళ గోదావరిలో దూకింది. ఈ విషయాన్ని దూరం నుంచి గమనించిన ఎస్‌ఐ ఆనంద్‌ అక్కడే ఉన్న గజ ఈతగాళ్ళకు చెప్పడంతో వారు హుటాహుటిన గోదావరిలోకి దూకి ఆమెను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. పదిహేనేళ్ళ క్రితమే తన భర్త చనిపోయాడని, తనకు అనారోగ్యం ఉండటంతో చనిపోవాలన్న నిర్ణయానికి వచ్చి గోదావరిలో దూకానని  ఆమె తెలిపారు. ఎస్‌ఐ ఆనంద్‌ ఆమె నుంచి వివరాలు సేకరించి వారి కుటుంబ సభ్యులను రప్పించి ఆమెను వారికి అప్పగించారు. ఎస్‌ఐ చొరవపై త్రీటౌన్‌ సిఐ మారుతీరావు తదితరులు ఆయనను అభినందించారు. ఎస్‌ఐ ఆనంద్‌తోపాటు సిబ్బంది  పి.రాజశేఖర్‌, ఎన్‌.నాగేశ్వరరావు ఈ సంఘటనలో చొరవ చూపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here