గోదావరిలో 10 లక్షల చేప పిల్లలు వదిలిన ఎం.పి. భరత్‌

0
252
రాజమహేంద్రవరం, నవంబర్‌ 9 : మత్స్య సంపదను అభివృద్ధి చేయడం ద్వారా మత్స్యకారులకు జీవనోపాధిని పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పార్లమెంట్‌ సభ్యులు మార్గాని భరత్‌ రామ్‌ అన్నారు. స్థానిక పుష్కర్‌ ఘాట్‌లో మత్స్య శాఖ ఆధ్వర్యంలో శనివారం మొదటి దశలో 10 లక్షల చేప పిల్లలను గోదావరిలో ఎంపి భరత్‌ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాలకు చేపల వ్యాపారం ప్రధానమైనదిగా ఉందన్నారు. గోదావరిలో చేపల పెంపకం ద్వారా వేలాదిగా ఉన్న మత్స్యకారులకు పెద్ద ఎత్తున జీవనోపాధి పొందేందుకు అవకాశం ఉందన్నారు. ఇటీవల కాలంలో కేంద్ర మత్స్య శాఖ మంత్రితో భేటి అయ్యి గోదావరిలో మత్స్య సంపద పెంపుదలకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. ఇందుకు కేంద్రమంత్రి సైతం సానుకూలంగా స్పందించారని తెలిపారు. ప్రస్తుతానికి మొదట దశలో పదిలక్షల చేప పిల్లలను విడుదల చేస్తున్నామని, మరో ఇరవై లక్షల చేప పిల్లలను దశల వారీగా గోదావరిలో విడుదల చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో మత్స్య శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ జయరావు, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ జి.వెంకటేశ్వరరావు, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జి.వి.రావు, ఎఫ్‌.డి.ఒ.లు రామకృష్ణ, సిహెచ్‌.రమేష్‌, ప్రకాష్‌, ఫీల్డ్‌ మెన్‌ మస్థాన్‌, ఎఐఎఫ్‌ శ్రీనివాస్‌, వైసిపి నాయకులు కానుబోయిన సాగర్‌, కొంచా సత్య, మత్స్యకార నాయకులు దాసరి సాంబ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here