గోదావరి తీరాన రేపు కార్డియాలజిస్టుల సదస్సు

0
141
రాజమహేంద్రవరం,ఆగస్టు 22 : ఆంధ్రప్రదేశ్‌ కార్డియాలజీ సొసైటీ ఆఫ్‌ ఇండియా (ఎపిసిఎస్‌ఐ) 5వ రాష్ట్రస్థాయి కార్డియాలజిస్టుల సదస్సును ఈనెల 24, 25 తేదీల్లో రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్నట్టు ఆర్గనైజింగ్‌సెక్రటరీ, బొల్లినేని (కిమ్స్‌) సిఇఓ డాక్టర్‌ ఎన్‌ఎస్‌ రామరాజు వెల్లడించారు. స్థానిక గాదాలమ్మ నగర్‌ రోడ్‌లో ఉన్న బివిఆర్‌ శ్రీ కన్వెన్షన్‌ సెంటర్లో రేపు ఉదయం 11 గంటలకు ఈ సదస్సును రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖా మంత్రి తానేటి వనిత, ఎన్టీఆర్‌ వైద్య విశ్వ విదాల్యయం ఉప కులపతి డాక్టర్‌ సివి రావు జ్యోతి వెలిగించి ప్రారంభిస్తారని, స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా హాజరవుతున్నారన్నారు. అంతర్జాతీయ, జాతీయస్థాయిలో గుండె వైద్యం అందిస్తున్న సుమారు 300 మంది కార్డియాలజిస్టులు ఈ సదస్సుకు హాజరవుతున్నారన్నారు. గుండె చికిత్సా విధానంలో ఇస్తున్న ఆధునిక పద్ధతులు, శస్త్రచికిత్సలు, వాటికి సంబంధించిన పరికరాలపై కూలంకషంగా చర్చించడం జరుగుతుందన్నారు. అనుభవజ్ఞులైన వైద్యులు వారి అనుభవాలను వివరిస్తారన్నారు. రాజమహేంద్రవరంలో 22 సంవత్సరాల కితం ఇటువంటి సదస్సు జరిగిందని మళ్లీ ఇప్పుడే జరుగుతోందన్నారు. గుండె వైద్యానికి గతంలో హైదరాబాద్‌ వరకు వెళ్లాల్సి వచ్చేదని రాజమహేంద్రవరం, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో కూడా ప్రజలకు అవసరమైన కార్డియాలజీ వైద్య సేవలను చాలావరకు అందుబాటులోకి తెచ్చి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని రామరాజు తెలిపారు. ఎవి సుబ్బారావు సదస్సుకి గౌరవ అధ్యక్షుడిగా, తాను ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా, ప్రసన్నకుమార్‌ నిర్వాహకులుగా వ్యవహరిస్తున్నామన్నారు. కార్డియాలజీతో పాటు దానికి అనుబంధంగా ఉన్న ఇతర అవయవాలకు సంబంధించిన చికిత్సలపై కూడా చర్చలు జరుగుతాయని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here