గోదావరి ప్రజల ఆతిథ్యం మరువలేనిది..

0
144
గ్యాంగ్‌ లీడర్‌ చిత్రం హీరో నాని
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 10 : కుటుంబం, మిత్రులు, గ్యాంగ్‌తో కలిసి సరదాగా అందరూ ఎంజాయ్‌ చేసేలా ‘గ్యాంగ్‌ లీడర్‌’ చిత్రాన్ని రూపొందిందని చిత్ర ¬రో, నేచురల్‌ స్టార్‌ నాని వెల్లడించారు. ఈ చిత్రం 13వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా రిలీజ్‌ అవుతోందన్నారు. స్థానిక షెల్టాన్‌లో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో నాని మాట్లాడుతూ రివెంజ్‌ బ్యాక్‌డ్రాప్‌ నేపథ్యంలో గ్యాంగ్‌లీడర్‌ చిత్రం తీసినప్పటికీ కామెడీగా సాగుతుందన్నారు. గోదావరి జిల్లాల ప్రజల ఆతిధ్యం మరువలేనిదని, ఇక్కడ మూడు వారాల పాటు గ్యాంగ్‌లీడర్‌ షూటింగ్‌ జరిగిందన్నారు. విశాఖపట్నంలో చిత్రం ప్రీ రిలీజ్‌ జరుగుతుందన్నారు. దానికి వెళు రాజమహేంద్రవరంలో ఆగి చిత్రానికి సంబంధించిన విశేషాలను వెల్లడించడానికి వచ్చానన్నారు. తన తదుపరి చిత్రం ‘వి’ అని ఇప్పటికే షూటింగ్‌ షెడ్యూల్‌ ప్రకారం జరుగుతోందన్నారు. గతంలో రిలీజై హిట్‌ కొట్టిన చిత్రాల పేర్లతో రూపొందుతున్న పేర్లతో తన చిత్రాలు వస్తున్నందున ధైర్యంగా ఉందన్నారు. ‘మనం’ వంటి హిట్‌ చిత్రాన్ని రూపొందించిన విక్రమ్‌ కుమార్‌కు ఈ చిత్రం స్పెషల్‌గా నిలుస్తుందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here