గోదావరి సాక్షికి  సాంకేతిక సొబగులు

0
340
రేపు యాప్‌ ఆవిష్కరణ –  డాక్టర్‌ రామారెడ్డికి సత్కారం
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 22 :  విజ్ఞాన సర్వస్వం, సరస్వతీ పుత్రులు, ప్రఖ్యాత మానసిక వైద్య నిపుణులు డాక్టర్‌ కర్రి రామారెడ్డి గోదావరి సాక్షి సాయంకాల పత్రికలో ప్రతి సోమవారం ‘మనస్సాక్షి’ శీర్షికన నిశితమైన వ్యంగ్యంతో సమకాలిన రాజకీయ, ఆర్థిక, సామాజిక స్థితిగతులపై నిరంతరాయంగా ఇప్పటి వరకు  వెయ్యి  వ్యాసాలు రాసి తన రచనా వ్యాసాంగాన్ని నిరంత రాయంగా కొనసాగిస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఆ బహుముఖ   ప్రతిభాశీలికి గోదావరి సాక్షి కుటుంబం రేపు చిరు సత్కారం నిర్వహించనుంది. హోటల్‌ లా హాస్పిన్‌లో రేపు సాయంత్రం 6 గంటలకు గోదావరి సాక్షి సంపాదకులు గన్ని కృష్ణ అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, సిటీ ఎమ్మెల్యే డా.ఆకుల సత్యనారాయణ, మేయర్‌ పంతం రజనీ శేషసాయి, శాసనమండలి సభ్యులు ఆదిరెడ్డి అప్పారావు, (మొదటి పేజీ తరువాయి)
సోము వీర్రాజు, మాజీ ఎమ్మెల్యే  రౌతు సూర్యప్రకాశరావు, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్‌, ఎపిఐఐసి మాజీ చైర్మన్‌ శ్రిఘాకోళ్ళపు శివరామ సుబ్రహ్మణ్యం, జిఎస్‌ఎల్‌ మెడికల్‌ కళాశాల, హాస్పటల్‌ చైర్మన్‌ డా. గన్ని భాస్కరరావు, సిసిసి ఎం.డి. పంతం కొండలరావు, వైఎస్సార్‌సిపి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా, రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సభ్యులు ముప్పాళ్ళ సుబ్బారావు, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు మీసాల సత్యనారాయణ, సిపిఎం రాజమహేంద్ర వరం జిల్లా కార్యదర్శి టి.అరుణ్‌,  కార్పొరేటర్లు, నగర ప్రముఖులు పాల్గొంటారు.
యాప్‌ ఆవిష్కరణ
గోదావరి తీరాన తొలి సాయంకాల దినపత్రికగా గత రెండు దశాబ్ధాల నుంచి నగర ప్రజలతో మమేకమవుతూ అందుబాటులోకి వచ్చిన అంతర్జాల పరిజ్ఞానాన్ని అందరి కంటే ముందుగా అందిపుచ్చుకుని ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడున్నా నగరంలోని వార్తా విశేషాలను తెలియజేస్తూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించిన గోదావరి ‘సాక్షి’ ఇపుడు ఆ దిశగా మరో ముందడుగు వేసింది.  అందులో భాగంగా  ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో కూడా చదువుకోగల సాక్షి యాప్‌ ఈ సందర్భంగా ఆవిష్కృతమవుతోంది.  అంతే గాక ఆధునికీకరించిన  న్యూ వెబ్‌సైట్‌ను కూడా ఆవిష్కరిస్తున్నారు. పత్రిక పాఠకులు, ప్రకటనకర్తలు, శ్రేయోభిలాషులు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని సంపాదకులు, ప్రచురణకర్త గన్ని కృష్ణ కోరారు.