గోరంట్లకు మద్దతుగా ప్రచారం

0
232
రాజమహేంద్రవరం, మార్చి 25 :  రూరల్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి మద్దతుగా జన్మభూమి కమిటీ సభ్యులు తలారి మూర్తి ఆధ్వర్యంలో ధవళేశ్వరంలో ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తలారి మూర్తి మాట్లాడుతూ రాజమహేంద్రవరం రూరల్‌ గ్రామీణ ప్రాంతాల రూపురేఖలను అభివృద్ధి మంత్రంతో మార్చేసిన తెలుగుదేశం పెద్దన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి గొంతు మరోమారు నవ్యాంధ్ర అసెంబ్లీలో ప్రతిధ్వనించాల్సిన అవసరం ఉందన్నారు. గత ఐదేళ్ళలో ధవళేశ్వరం గ్రామంలో పేద ప్రజల పక్షాన శాసనసభ్యుడిగా గోరంట్ల ప్రత్యేక శ్రద్ధతో సామాజిక ఫించన్లు, గృహ వసతి..ప్రభుత్వ పథకాలతో నిస్సహయులకు చేయూత నిచ్చారని తెలిపారు. గ్రామానికి ఆయన చేసిన సేవలకు తిరిగి రుణం తీర్చుకునే అవకాశం మరోసారి వచ్చిందని, రాబోయే ఎన్నికల్లో గోరంట్ల బుచ్చయ్య  చౌదరిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని, అందుకు సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. ఈ ప్రచారం కార్యక్రమంలో కంచర లైన్‌ శెట్టిబలిజ సంఘం నాయకులు అండిబోయిన.బ్రహ్మజీ, నాగు, మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here