గౌతు లచ్చన్న సేవలు చిరస్మరణీయం

0
326

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 19 : స్వాతంత్ర సమరయోధులు సర్దార్‌ గౌతు లచ్చన్న 12వ వర్ధంతి వై.జంక్షన్‌లో గౌడ, శెట్టిబలిజ సంఘం అధ్యక్షులు రెడ్డి రాజు అధ్యక్షతన జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ, నగర మేయర్‌ పంతం రజనీశేషసాయి, ఆర్యాపురం బ్యాంక్‌ చైర్మన్‌ చల్లా శంకరరావు, యువనాయకులు ఆదిరెడ్డి వాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ గౌతు లచ్చన్న బీసీలకు చేసిన సేవలు మరువలేనివని, స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి బీసీల వెనుకబాటుతనాన్ని గుర్తించారని, ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో మార్గాని నాగేశ్వరరావు, ఎన్‌.వి. శ్రీనివాస్‌, కార్పొరేటర్‌లు రామకృష్ణ, పితాని లక్ష్మి, బాపన సుధారాణి, సూరంపూడి శ్రీహరి, దొండపాటి సత్యంబాబు, మాజీ కార్పొరేటర్‌లు గూడూరి రాధిక, మజ్జి అప్పారావు, కాశి నవీన్‌, మట్టా రాజు, మార్గాని చంటిబాబు, గుత్తుల దుర్గారావు, అత్తిలి రాజు, తదితరులు పాల్గొన్నారు.

గోదావరి గట్టున..

స్వర్గీయ సర్ధార్‌ గౌతు లచ్చన్న వర్థంతి కార్యక్రమాన్ని బీసీ నాయకులు వాసంశెట్టి గంగాధరరావు, కోడి ప్రవీణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో గోదావరి గట్టున ఉన్న గౌతు లచ్చన్న విగ్రహం వద్ద నిర్వహించారు. ముఖ్యఅతిధులుగా గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మేయర్‌ పంతం రజనీ శేషసాయి, వైకాపా సిజిసి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, ఆర్యాపురం బ్యాంక్‌ చైర్మన్‌ చల్లా శంకరరావు, సిసిసి ఎం.డి. పంతం కొండలరావు, ఎఐసిసి సభ్యులు ఎస్‌.ఎన్‌.రాజా, చాంబర్‌ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర జెఏసీ కన్వీనర్‌ మార్గాని నాగేశ్వరరావు, నగర కాంగ్రెస్‌ అధ్యక్షులు ఎన్‌.వి.శ్రీనివాస్‌ తదితరులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారతదేశంలో సర్ధార్‌ అనే బిరుదును వల్లభాయి పటేల్‌ తరువాత గౌతు లచ్చన్నకే దక్కిందన్నారు. స్వాతంత్య్ర సమరంలో నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌, మహాత్మాగాంధీ వంటి మహానాయకులతో కలిసి ఉద్యమించారని, ఆనాడు 1938లోనే రైతుల కోసం పాదయాత్ర చేసిన ఘనత గౌతు లచ్చన్నకు దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో దళితరత్న కాశి నవీన్‌కుమార్‌, కె.హారిక, యిన్నమూరి రాంబాబు, ఆదిరెడ్డి వాసు, షర్మిలారెడ్డి, బుడ్డిగ రాధ, పట్టపగలు వెంకట్రావు, సూరంపూడి శ్రీహరి, మరుకుర్తి దుర్గాయాదవ్‌, కురగంటి సతీష్‌, కుడుపూడి సత్తిబాబు, గోలి రవి, కోడికోట సత్తిబాబు, పిల్లి నిర్మల, బొంతా శ్రీహరి, జక్కంపూడి గణేష్‌, బాలేపల్లి మురళీధర్‌, ఆకుల సూర్యభాగ్యలక్ష్మి, నలబాటి శ్యామ్‌, పుట్టా సాయిబాబు, మేరపురెడ్డి రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here