గ్రామదర్శినికి సిటీ ప్రొటోకాల్‌ ఇన్‌ఛార్జిలుగా ఆదిరెడ్డి, గన్ని 

0
532
రాజమహేంద్రవరం, జులై 16 : తెలుగుదేశం పార్టీ నేటి నుంచి ప్రారంభించిన గ్రామ దర్శిని, గ్రామ వికాస కార్యక్రమాలకు  నియోజకవర్గాల వారీగా ప్రోటొకాల్‌ ఇన్‌ఛార్జిలను  ఆ పార్టీ అధిష్ఠానం నియమించింది. అందులో భాగంగా రాజమహేంద్రవరం సిటీ అసెంబ్లీ నియోజకవర్గ ప్రొటోకాల్‌ ఇన్‌ఛార్జిలుగా ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, గోదావరి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (గుడా) చైర్మన్‌ గన్ని కృష్ణ నియమితులయ్యారు. అలాగే తుని నియోజకవర్గానికి మంత్రి యనమల రామకృష్ణుడు, కొత్తపేట నియోజకవర్గానికి ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here