ఘనంగా కరుటూరి అభిషేక్‌ జన్మదిన వేడుకలు 

0
379
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 25: నగర టిఎన్‌ఎస్‌ఎఫ్‌ అధ్యక్షులు కరుటూరి అభిషేక్‌ జన్మదిన వేడుకల సందర్భంగా ఆర్యాపురం వినాయకుని ఆలయంలో అభిషేక్‌ యూత్‌ పూజలు నిర్వహించారు. అనంతరం ర్యాలీ నిర్వహించి కేక్‌ కట్‌ చేశారు. జియోన్‌ అంధుల పాఠశాలలో విద్యార్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అభిషేక్‌కు తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గన్ని కృష్ణ జన్మదిన శుభాకాంక్షలు తెలిపి మొక్కను అందజేశారు. ఈ కార్యక్రమంలో అభిషేక్‌ యువత డి.రాజా, ఎస్‌.జానకిరామ్‌, ఎం.షణ్ముఖ్‌, రాజేష్‌, భాస్కర్‌, ఆదిత్య, స్వరూప్‌, విజయ్‌, వంశీ, చైతన్య, శశి, రమేష్‌, శివ, కళ్యాణ్‌ పాల్గొన్నారు.