ఘనంగా పటేల్‌ జయంతి వేడుకలు 

0
220
రాజమహేంద్రవరం, నవంబర్‌ 1 : రాజమహేంద్రవరం రూరల్‌ మండల భాజపా కమిటీ ఆధ్వర్యంలో బుచ్చియ్యనగర్‌లో సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి భాజపా జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ చిత్రపటానికి పూలమాలవేసిన వీర్రాజు సభను ఉద్దేశించి మాట్లాడుతూ పటేల్‌ అత్యంత చాతుర్యంగా ఐదు వందలకు పైగా సంస్థానాలను భారత దేశంలో విలీనమయ్యేలా చేశారన్నారు. భారతదేశ ఐక్యత కోసం ఉక్కు సంకల్పంతో పనిచేసిన  పటేల్‌ జీవితం మనందరికీ స్ఫూర్తి కావాలన్నారు. కేంద్ర ప్రభుత్వం  పటేల్‌ జయంతిరోజును ఐక్యత దినోత్సవంగా ప్రకటించిందని నరేంద్రమోడీ నాయకత్వాన్ని బలపర్చడం ద్వారా పటేల్‌ వంటి నేతలు కలలుగన్న భారతదేశాన్ని నిర్మాణం చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులుగా యానాపు యేసు, జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రాల వెంకట్రావు, అసెంబ్లీ కన్వీనర్‌ ఒంటెద్దు స్వామి, కరుటూరి శ్రీనివాసరావు, రొంగల గోపి, కందుకూరి మనోజు, పన్నాల వెంకటలక్ష్మి, పడాల ఆంజనేయులు, మట్టా నాగబాబు, మన్యం శ్రీను, గేదెల రమేష్‌, రేలంగి శ్రీను, నాశంశెట్టి శ్రీను, వి.రామకృష్ణ, బర్మా, సిహెచ్‌.లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.