ఘనంగా మల్లిపూడి నెల్సన్‌ లూధరన్‌ ఆలయ ప్రతిష్టా కృతజ్ఞత ఆరాధన

0
116
రాజహేంద్రవరం, డిసెంబర్‌ 4 : రెవ డా.మల్లిపూడి నెల్సన్‌ మెమోరియల్‌ లూదరన్‌ ఆలయ 25వ వార్షిక ఆలయ ప్రతిష్టా కృతజ్ఞత ఆరాధన బుధవారం స్ధానిక స్వామి, అశోక ధియేటర్‌ల జంక్షన్‌లోని లూధరన్‌ ఆలయంలో ఘనంగా జరిగింది. కృతజ్ఞత వేడుక సభకు బిషప్‌ కె యేసుదాసు అధ్యక్షత వహించారు. రెవరెండ్‌ ఐ కమలరావు, రెవరెండ్‌ ఎం మార్టిన్‌ లూధర్‌, రెవరెండ్‌ ఎం రవిరాజ్‌, రెవరెండ్‌ బిడబ్ల్యూ జెబులోను, రెవరెండ్‌ జిడబ్ల్యూ ప్రార్ధన కుమార్‌, రెవరెండ్‌ ఎ సామ్యూల్‌ రాజ్‌, రెవరెండ్‌ జిడి నెల్సన్‌బాబు, రెవరెండ్‌ చైతన్యకుమార్‌, రెవరెండ్‌ డాకటర్‌ సుభాకర్‌శాస్త్రి, సంఘ పెద్దలు వైరాల అప్పారావు, యార్లగడ్డ మెహనరావు, యార్లగడ్డ శ్యామ్‌ సుందర్‌, దేవరాజ్‌, కొమ్ము యేసు, అలజంగి చిన్ని, సిద్దెల రాజబాబు, క్రిస్టి లలిత కుమారి, క్రిస్టి మాధవి తదితరులు పాల్గొన్నారు. స్తోత్ర గీతాలు ఆలపించి, బైబిల్‌ సందేశం అందించారు.  రెవరెండ్‌ నెల్సన్‌ పరిచర్య పొటోలతో రూపొందించిన పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. అనంతరం ప్రేమ విందు ఏర్పాటు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here