ఘనంగా మళ్ళ వెంకట్రాజు జన్మదిన వేడుకలు

0
332

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 7 : స్థానిక 42వ డివిజన్‌ తెదేపా అధ్యక్షులు మళ్ళ వెంకట్రాజు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. డివిజన్‌లోని ఖాళీ స్పెషల్‌ మున్సిపల్‌ పాఠశాలలో జరిగిన ఈ వేడుకలకు ముఖ్యఅతిధిగా గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా పాఠశాలల్లో మొక్కలు నాటారు. పేద వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. పుట్టినరోజు జరుపుకున్న మళ్ళ వెంకట్రాజు గన్ని కృష్ణ మొక్క అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గుడా చైర్మన్‌ గన్ని కృష్ణను దుశ్శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. డివిజన్‌ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్న మళ్ళ వెంకట్రాజు మరింత ఎదగాలని గన్ని కృష్ణ ఆశీస్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో దళితరత్న కాశి నవీన్‌కుమార్‌, కార్పొరేటర్లు యిన్నమూరి రాంబాబు, పాలిక శ్రీను, మళ్ళ నాగలక్ష్మి, బెజవాడ రాజ్‌కుమార్‌, కోసూరి చండీప్రియ, తంగెళ్ళ బాబి, గగ్గర సూర్యనారాయణ, కోరుమిల్లి విజయశేఖర్‌, పార్టీ నాయకులు పెనుగొండ రామకృష్ణ, కరగాని వేణు, శనివాడ అర్జున్‌, ఎం.ఏ.రషీద్‌, కో-ఆప్షన్‌ సభ్యురాలు కప్పల వెలుగుకుమారి, డివిజన్‌ పెద్దలు, పార్టీ నాయకులు, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here