ఘనంగా ముగిసిన నర్తనరంగ స్వర్ణోత్సవం

0
165
డాక్టర్‌ సప్పా దుర్గాప్రసాద్‌కు ఘన సన్మానం
రాజమహేంద్రవరం, నవంబర్‌ 25 :  నగరానికి నాట్యరంగంలో ఎవరూ సాధించలేని ఎన్నో ఘనసాధనలు సాధించి అంతర్జాతీయ ఖ్యాతిని డాక్టర్‌ సప్పా దుర్గాప్రసాద్‌ అందించారని పలువురు వక్తలు కొనియాడారు. విఖ్యాత నాట్య పండితుడిగా, రచయితగా ఆలయ నృత్యానికి పునర్‌ సృష్టిచేసిన ఘనత ఆయనకే దక్కుతుందని ప్రశంసించారు. డాక్టర్‌ సప్పా దుర్గాప్రసాద్‌ నర్తన రంగంలోకి ప్రవేశించి 50 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా నర్తన రంగ స్వర్ణోత్సవాలు శ్రీ వేంకటేశ్వరా ఆనం కళాకేంద్రంలో ఘనంగా ముగిసాయి. పలు దేశాలకు చెందిన నాట్యాచార్యులు, వారి శిష్యులు ప్రదర్శించిన నృత్యాలు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. స్వర్ణోత్సవాల ముగింపు సభలో రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్‌, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎపిఐఐసి మాజీ చైర్మన్‌, వైసిపి సిటీ కో ఆర్డినేటర్‌ శ్రీఘాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, తుమ్మిడి రాజ్‌కుమార్‌, తుమ్మిడి విజయకుమార్‌ చేతులమీదుగా డాక్టర్‌ సప్పా దుర్గాప్రసాద్‌ను ఘనంగా సన్మానించారు. ఇటువంటి నాట్య కళాకారుల్ని సత్కరించే అవకాశం రావడం గర్వకారణమని హర్షం వ్యక్తం చేసారు. రాజమహేంద్రవరం చరిత్రలో మరిన్ని కీర్తి కిరీటాలు సాధించే సప్పా కళాకారులను తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. నటరాజ నృత్యనికేతన్‌ నిర్వాహకులు పివిఎస్‌ కృష్ణారావు, చావలి రాజేశ్వరరావు, కె.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కాగా సప్పా నర్తన రంగ స్వర్ణోత్సవం సందర్భంగా నర్తనయానం పేరిట స్వర్ణోత్సవ నిర్వాహక సంఘం, నటరాజ నృత్య నికేతన్‌  ఆధ్వర్యంలో నిర్వహించిన నర్తనయానం కార్యక్రమాన్ని ఆదివారం నాడు  శివ కామేశ్వరి  పీఠం అధిపతి ఈమని దక్షిణామూర్తి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.   ఈ సందర్భంగా సప్పా వద్ద  నృత్యం అభ్యసించి  దేశ విదేశాల్లో స్ధిరపడ్డ శిష్యులు  వివిధ నృత్య ప్రదర్శనలు ఇచ్చారు.  ఉదయం 9 గంటల నుంచి  మాధురి(న్యూయార్క్‌),  డా.సంధ్యారాణి (లండన్‌), కె.జ్యోత్స్న (కాలిఫోర్నియా), కెఎల్‌ స్రవంతి(కెనడా) జిఎస్‌ పల్లవి (బెహ్రిన్‌), కె. క్రాంతి (దుబాయ్‌), అనిత (న్యూఢిల్లీ), ఎన్‌ గాయత్రి (విజయనగరం), సిహెచ్‌ భారతి, కె. సత్యవాణిశ్రీ,  పి.శ్రీపూజిత,  కె వాణి విశ్వనాథ్‌, కె మనోజ్ఞ సాయిస్ఫూర్తి, కె జాహ్నవి, కె.సహస్ర, డి.నవ్యశ్రీ, ఎన్‌ ఆరుషి దుర్గాంబిక, ఎస్‌.భువన, కెకెఎండి జ్ఞానశ్రీ, ఎం.కీర్తన, జి.చార్విశ్రీ, ఎం వసంతవల్లరి, వి.అక్షయ, ఎంఎన్‌ఎస్‌ సాయిలు ప్రదర్శనలు ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here