ఘనంగా ‘రాజమహేంద్రి’ కళాశాల రజతోత్సవ వేడుకలు

0
359
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 4 : రాజమహేంద్రి మహిళా కళాశాల రజతోత్సవ కార్యక్రమం ఈరోజు ఉత్సాహ పూరిత వాతావరణంలో సాగింది. స్థానిక ఆనం కళా కేంద్రంలో రజతోత్సవ వేడుకలతోపాటు, ఫ్రెషర్స్‌ డే వేడుకలు సంయుక్తంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో నగర మేయర్‌ పంతం రజనీ శేషసాయి, కళాశాల గౌరవాధ్యక్షులు, ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్‌ కర్రి రామారెడ్డి, నన్నయ యూనివర్శిటీ వైస్‌ ఛాన్సలర్‌ ఆచార్య ముర్రు ముత్యాలు నాయుడు, ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్‌ ఎస్‌పి గంగిరెడ్డితోపాటు, రాజమహేంద్రి మహిళా డిగ్రీ కళాశాల కరస్పాండెంట్‌ టికె విశ్వేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా  అతిథులు మాట్లాడుతూ 75 మంది విద్యార్థినీలతో ప్రారంభమైన రాజమహేంద్రి మహిళా డిగ్రీ కళాశాల ఉన్నత విద్యా ప్రమాణాలతో  నేడు 1400 మంది విద్యార్ధినులతో అభివృద్ధి చెందడం అభినందనీయమని అన్నారు. నన్నయ్య యూనివర్సిటీ పరిధిలో 236 కాలేజీలు ఉండగా సంఖ్యాపరంగా రాజమహేంద్రి మహిళా డిగ్రీ కళాశాల 8వ స్థానంలోనూ, ఉపాధి కల్పనలో మొదటి స్థానంలోనూ ఉండటం సంతోదాయకమని అన్నారు. కళాశాలలో చేరాక, డిగ్రీ పూరయ్యే సరికి జాబ్‌తో బయటకు వెళ్లేలా ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నామని, 226 మంది డిగ్రీ చదివితే అందులో 186 మంది ఉద్యోగాలు సాధించడం అంటే విద్యపట్ల యాజమాన్యం చూపిస్తున్న శ్రద్ధను తెలియచేస్తుందన్నారు. డిగ్రీ మొదటి సంవత్సరం నుంచే ఉద్యోగానికి సంబంధించిన అంశాలలో శిక్షణ ఇవ్వడాన్ని వక్తలు కొనియాడారు. ఈ సందర్భంగా ఇప్పటివరకూ పనిచేసిన ప్రిన్సిపాల్స్‌తోపాటు, అలాగే ఉన్నత స్థాయికి చేరిన విద్యార్థులకు, మంచి శిక్షణ ఇచ్చిన అధ్యాపకులకు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ సత్య సౌందర్య, వైస్‌ ప్రిన్సిపాల్‌ సత్యనారాయణ, కంప్యూటర్‌ డిపార్ట్‌మెంట్‌ హెడ్‌ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here