ఘనంగా వైఎంవిఏ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

0
522
రాజమహేంద్రవరం, ఆగస్టు 16 : ప్రతిష్టాత్మకమైన ది యంగ్‌మెన్స్‌ వైశ్యా అసోసియేషన్‌ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా ఎం.పి. మాగంటి మురళీమోహన్‌, గుడా  చైర్మన్‌ గన్ని కృష్ణ, మేయర్‌ పంతం రజనీ శేషసాయి, ఎపిఐఐసి మాజీ చైర్మన్‌ శ్రిఘాకోళ్ళపు శివరామ సుబ్రహ్మణ్యం, శాప్‌ డైరెక్టర్‌ యర్రా వేణుగోపాలరాయుడు హాజరయ్యారు. అధ్యక్షులుగా తవ్వా రాజా, కార్యదర్శిగా కోడూరి శేషగిరిరావు, కోశాధికారిగా బొలిశెట్టి టి.వి.ఎస్‌.మూర్తి (చిట్టిబాబు), ఉపాధ్యక్షులుగా మద్దుల శ్రీనివాస్‌, యిన్నమూరి దీపు, మైలవరపు శ్యామలరావు, సహాయ కార్యదర్శులుగా ఎన్‌.ఎల్‌.వి.కళ్యాణ్‌, అప్పన షణ్ముఖ్‌ రంగరాజు,  కారుమూరి చరణ్‌ తేజ, లిటరరీ సెక్రటరీగా కాకి రామకృష్ణ, గేమ్స్‌ సెక్రటరీగా కె.రవికాంత్‌, ఎఫ్‌సిసి సెక్రటరీగా కొత్త వెంకట కిషోర్‌, తదితర కార్యవర్గ సభ్యులు, వైశ్యా లేడీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలిగా తవ్వా సుభాషిణి,  కార్యదర్శిగా కోడూరి పుష్ప సుధ, కోశాధికారిగా బొలిశెట్టి లక్ష్మీ కృష్ణ కుమారి, ఉపాధ్యక్షురాలిగా మండవిల్లి సునంద, మద్దుల లక్ష్మి, సహాయ కార్యదర్శులుగా పెంటపాటి సృజన, బొలిశెట్టి శిరీషతోపాటు అడ్వైజరీ కమిటీ, కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. సేవా కార్యక్రమాల్లో వైఎంవిఏకు ప్రత్యేకత ఉందని, నూతన కార్యవర్గ సభ్యులు దానిని కొనసాగించాలని వక్తలు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మట్టే శ్రీనివాస్‌, కంతేటి కాశి, కంచర్ల మాణిక్యాలరావు, కంచర్ల వెంకటరావు, కూర్మదాసు ప్రభాకర్‌, నూలు లక్ష్మీ శ్రీదేవి, యిన్నమూరి రాంబాబు, మాటూరి రంగారావు, సత్యవరపు గోకుల మురళి, పులవర్తి వెంకటేష్‌, చిట్టూరి సీతారామరాజు, కోడూరి శేషగిరిరావు, పులవర్తి రాజశ్రీ, బొండాడ నీలిమ, పెంటపాటి సృజన తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here