చంద్రన్న బీమాతో పేద కుటుంబాలకు ధీమా : గోరంట్ల

0
325
రాజమహేంద్రవరం, జూన్‌ 19 : రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన చంద్రన్న బీమా పథకం పేద కుటుంబాలకు ధీమానిస్తుందని రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. స్థానిక కొంతమూరు గ్రామానికి చెందిన షేక్‌ బాబ్జి ఇటీవల గుండెపోటుతో మరణించగా ఆ కుటుంబానికి చంద్రన్న బీమా పథకం ద్వారా రూ.2లక్షలు మంజూరయ్యాయి. వాటిని ఎమ్మెల్యే గోరంట్ల చేతులమీదుగా బాబ్జి కుమారుడు బషీర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్ని వాసు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here