చంద్రన్న బీమా పథకం అమలుపై సమీక్ష

0
429
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 23 : స్థానిక కోర్లమ్మపేట కమ్యూనిటీ హాలులో చంద్రన్న బీమా పథకంపై రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ పరిధిలోని ఎస్‌ఎల్‌ఎఫ్‌ ఆర్‌పిలు, కమ్యూనిటీ ఆర్గనైజర్స్‌తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌  శ్రీ శ్రీనివాస్‌ ఎంతమందికి చంద్రన్న బీమా నమోదు చేశారో డివిజన్‌ వారీగా ఎస్‌ఎల్‌ఎఫ్‌ ఆర్‌పిలను అడిగి తెలుసుకున్నారు. అలాగే నమోదైన వారి వద్ద నుండి ఎంత మొత్తం సేవ రుసుము వసూలు కాబడినది అడిగి తెలుసుకున్నారు. అందరూ ఎస్‌ఎస్‌ఎఫ్‌ ఆర్‌పిలు, కమ్యూనిటీ ఆర్గనైజర్స్‌ కలిసి డివిజన్‌ వారీగా ఇంటింటా ప్రచారం నిర్వహించి అసంఘటిత రంగ కార్మికులు అందరినీ నమోదు చేయవలసినదిగా ఆదేశించారు. ఈ సమావేశంలో మెప్మా కమిటీ చైర్మన్‌ పెనుగొండ విజయభారతి మాట్లాడుతూ కార్పొరేటర్ల సహకారం తీసుకుని అర్హులైన అసంగఠిత రంగ కార్మికులు అందరినీ నమోదు చేయవలసినదిగా కోరారు. ఈ సమావేశానికి మెప్మా కమిటీ సభ్యులు 41వ డివిజన్‌ కార్పొరేటర్‌ మర్రి దుర్గా శ్రీనివాస్‌, 44వ డివిజన్‌ కార్పొరేటర్‌ పాలవలస వీరభద్రం, టౌన్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ కె.జోగారావు, కమ్యూనిటీ ఆర్గనైజర్స్‌ పాల్గొన్నారు.