చంద్రబాబుకు అన్నీ చెప్పా..తుది నిర్ణయం ఆయనదే

0
185
టిక్కెట్‌పై గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ
రాజమహేంద్రవరం, మార్చి 10 : రానున్న ఎన్నికల్లో ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేయాలో నిర్ణయించేది పార్టీ అధినేత చంద్రబాబునాయుడేనని, ఆయన ప్రకటించే వరకు ఎవరికీ అభ్యర్థిత్వాలు ఖరారైనట్లు కాదని గుడా చైర్మన్‌, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సీనియర్‌ నాయకులు గన్ని కృష్ణ అన్నారు. తన పోటీ విషయంపై అధినేతను కలిసి అన్ని విషయాలను వివరించానని, తుది నిర్ణయం ఆయన తీసుకుంటారని అన్నారు. తనకు అవకాశం కల్పించకపోతే పార్టీని తిట్టడం, కండువాలు మార్చే నైజం తనది కాదన్నారు. అయితే ఆత్మగౌరవానికి భంగం కలిగితే  రెండు చేతులో జోడించి రాజకీయాలకు నమస్కారం చెబుతానే తప్ప కన్నతల్లి లాంటి పార్టీకి ద్రోహం చేసే ఆలోచన తనది కాదని అన్నారు. తన నిజాయితీ, అంకిత భావం, విధేయతపై తనకు నమ్మకం ఉందని, అయితే తన విధేయతను బలహీనతగా భావించవద్దని విమర్శకులకు ఆయన ఘాటుగా సమాధానమిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here