చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యం

0
227
45వ డివిజన్‌లో 2వ రోజు కొనసాగిన నగరదర్శిని
రాజమహేంద్రవరం, ఆగస్టు 11 : సమర్ధత, ఆలోచన, పట్టుదల కలిగిన సీఎం చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. స్థానిక 45వ డివిజన్‌లో తెలుగుదేశం పార్టీ నగరదర్శిని కార్యక్రమాన్ని రెండవరోజు కొనసాగించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఇంటింటికీ వెళ్ళి ప్రజలతో మమేకమయ్యారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగపరుచుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా గన్ని, ఆదిరెడ్డి, మేయర్‌ పంతం రజనీ శేషసాయి మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన ఎజెండాగా సీఎం చంద్రబాబు కృషిచేస్తున్నారని, ఆయనకు అండగా నిలిస్తే రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారని సూచించారు. ఈ కార్యక్రమంలో నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వాసిరెడ్డి రాంబాబు, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కాశి నవీన్‌కుమార్‌, పార్టీ నగర ప్రధాన కార్యదర్శి రెడ్డి మణి, కడితి జోగారావు, కార్పొరేటర్‌ యిన్నమూరి రాంబాబు, అట్టాడ రవి, మెహబూబ్‌ఖాన్‌, విజయ్‌, పుట్టా సాయిబాబు, రవి, బత్తిన చక్రరావు, విజ్జిన సుధాకర్‌, డివిజన్‌ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here