చంద్రబాబుది చేతల ప్రభుత్వం

0
257
ఉత్సాహంగా జన చైతన్య యాత్ర 
 
రాజమహేంద్రవరం, నవంబర్‌ 4 : కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను అగ్రభాగాన నిలిపేందుకు చంద్రబాబు చేస్తున్న కృషి వర్ణింపలేనిదని, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేస్తూ మరోసారి చేతల ప్రభుత్వంగా నిరూపించుకున్నారని రూరల్‌ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. స్థానిక 12వ డివిజన్‌లో ఈరోజు జనచైతన్య యాత్రను ప్రారంభించారు. డివిజన్‌ ఇన్‌ఛార్జి రంధి శ్రీనివాస్‌ ఆధ్వర్యాన నిర్వహించిన ఈ కార్యక్రమంలో రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మేయర్‌ పంతం రజనీ శేషసాయి, ఆర్యాపురం అర్బన్‌ బ్యాంక్‌ చైర్మన్‌ చల్లా శంకరరావు, డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు, ఫ్లోర్‌ లీడర్‌ వర్రే శ్రీనివాసరావు, పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి వాసు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ  పారదర్శక పాలన అందిస్తూ రాష్ట్రాభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న చంద్రబాబుపై వైకాపా విమర్శించడం సిగ్గు చేటన్నారు. కులమతాలను రెచ్చగొట్టి అధికారంలోకి రావాలన్న అత్యాశను విడనాడి చంద్రబాబు చేస్తున్న కృషికి తోడ్పాటునందించాలన్నారు. నిత్యావసర వస్తువులు, పెన్షన్ల పంపిణీలో ఎలాంటి అవకతవకలు జరగకూడదని భావించి బయో మెట్రిక్‌ సిస్టమ్‌ ప్రవేశపెట్టారని, అన్ని వర్గాలకు నిధులు మంజూరు చేస్తూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ అంధకారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో వెలుగులు నింపుతున్నారని, విద్యుత్‌ కోతలు లేకుండా నిరంతర సరఫరా ఇచ్చారని తెలిపారు. ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా రాజధాని నిర్మాణం చేపడుతున్నారన్నారు. చంద్రబాబు చేసిన అభివృద్ధిని అంకెలతో సహా వివరిస్తున్నామని, ఇలాంటి తరుణంలో ఇంతకు మించి ఎవరైనా చేయగలరా అని ప్రశ్నించారు. మేయర్‌ పంతం రజనీ శేషసాయి మాట్లాడుతూ చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని వివరించేందుకే జన చైతన్య యాత్రలు చేపట్టామన్నారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి పార్టీ కరపత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు యేలూరి వెంకటేశ్వరరావు, కురగంటి సతీష్‌, పరిమి వాసు, రెడ్డి మణి, రొబ్బి విజయశేఖర్‌, యార్లగడ్డ శేఖర్‌, కానుమిల్లి వెంకన్నదొర, అరిగెల బాబూ నాగేంద్రప్రసాద్‌, కార్పొరేటర్లు కిలపర్తి శ్రీనివాస్‌, కడలి రామకృష్ణ, పల్లి శ్రీనివాస్‌, కోరుమిల్లి విజయశేఖర్‌, బూర దుర్గాంజనేయరావు, మానుపాటి తాతారావు, కో-ఆప్షన్‌ సభ్యురాలు మజ్జి పద్మ, నాయకులు మానే దొరబాబు, బూరాడ భవానీశంకర్‌, సూరంపూడి శ్రీహరి, కడితి జోగారావు, శీలం గోవింద్‌, తలారి భగవాన్‌, కడియాల రాజశేఖర్‌, పురెడ్ల శేషుకుమార్‌రెడ్డి, వెంపటాపు వాసు, పొదిలాపు నాగేంద్ర, మేరపురెడ్డి రామకృష్ణ, జాగు వెంకటరమణ, బిల్డర్‌ చిన్న, కొండేటి సుధ, కంచిపాటి గోవింద్‌, కోరాడ సత్యశ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.