చంద్రబాబును కలిసిన గన్ని

0
295
తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ
రాజమహేంద్రవరం, జూన్‌ 27 : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును గుడా మాజీ చైర్మన్‌ గన్నికృష్ణ ఈరోజు అమరావతిలో కలిసారు. ప్రస్తుత తాజా రాజకీయ పరిస్థితులపై గన్ని ప్రజల అభిప్రాయాలను అధినేతకు తెలియజేశారు. ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న కక్ష సాధింపు చర్యలపై ప్రజల్లో తెలుగుదేశం పార్టీకి సానుభూతి వస్తుందని, ఇప్పటికే పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరగలేదని కేంద్రం క్లీన్‌ చీట్‌ ఇచ్చిందన్నారు. నిజాలన్ని నిలకడగా తెలుస్తాయని, ఇలాంటి తరుణంలో కొంతమంది పార్టీ మారారాన్న దానిపై నిరుత్సాహపడాల్సిన అవసరం లేదన్నారు.పార్టీ కార్యకర్తలు తమతో ఉత్సాహంగా అడుగులు వేసి పార్టీని పటిష్టపరిచేందుకు సంసిధ్దులుగా ఉన్నారని పేర్కొన్నారు. ముందుగా జిల్లాలు,నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి కమిటీలు వేయాలని కోరారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ మీలాంటి కమిటెడ్‌ కార్యకర్తలెందరో ఉండగా పార్టీ భవిష్యత్తుకు ఏమాత్రం ఢోకా లేదని, అందరం కలిసి కట్టుగా ప్రజల కోసం పనిచేసి పార్టీకి పూర్వవైభవాన్ని సాధిద్దామని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here