చంద్రబాబు కష్టాన్ని గుర్తించండి : గన్ని కృష్ణ

0
217
రాజమహేంద్రవరం,  నవంబర్‌ 22 : రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం సీఎం చంద్రబాబునాయుడు పడుతున్న కష్టాన్ని ప్రజలు గుర్తించాలని, ఆర్థిక లోటున్నా అభివృద్ధి విషయంలో ఏమాత్రం రాజీపడకుండా ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నారని గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ అన్నారు. స్థానిక 30వ డివిజన్‌లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. మహిళలు ముందుకు వచ్చి పార్టీ సభ్యత్వాన్ని తీసుకుంటున్నారని, ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన హామీని అమలు చేసి మాట తప్పని నాయకునిగా చంద్రబాబు నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్‌ రెడ్డి మణి, వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here