చంద్రబాబు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం

0
310
నగరదర్శినిలో హర్షం వ్యక్తం చేసిన ప్రజానీకం
రాజమహేంద్రవరం, నవంబర్‌ 3 : సిఎం చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయం తీసుకున్న అది రాష్ట్ర ప్రజల ఉజ్వల భవిష్యత్‌ కోసమేనని, ఆయనకు మా మద్దతు ఉంటుందని ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. స్థానిక 22వ డివిజన్‌లో తెదేపా నగరదర్శిని కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్పొరేటర్‌ మాటూరి రంగారావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ, మేయర్‌ పంతం రజనీ శేషసాయి, శాప్‌ డైరెక్టర్‌ యర్రా వేణుగోపాలరాయుడు, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కాశి నవీన్‌ కుమార్‌, పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి వాసు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్‌.టి.ఆర్‌.విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం ఇంటింటికీ వెళ్ళి ప్రజలతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా గన్ని కృష్ణ ప్రజలతో మాట్లాడారు. కాంగ్రెస్‌ యువనేత రాహుల్‌ గాంధీతో చంద్రబాబు కలవడంపై  అభిప్రాయం ఏమిటని వివిధ వర్గాల ప్రజలను ప్రశ్నించారు. దానికి వారు సమాధానమిస్తూ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను, రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటారని, ఆయన నిర్ణయాలను స్వాగతిస్తామని అన్నారు. బిజెపి ప్రభుత్వం నమ్మించి మోసం చేయడం వల్ల వారితో విభేదించి ఇప్పడు కాంగ్రెస్‌తో కలిసారని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.ఈ సందర్బంగా గన్ని కృష్ణ మాట్లాడుతూ నమ్మించి మోసం చేసిన మోడి సర్కార్‌కు బుద్ది చెప్పాలని, దేశాన్ని, రాష్ట్రాన్ని రక్షించాలని సంకల్పించి దేశంలో ప్రతిపక్షాలను ఏకం చేస్తున్నారని అన్నారు.  ప్రతినిత్యం ప్రజల శ్రేయస్సు కోసమే చంద్రబాబు పని చేస్తారని అన్నారు. మేయర్‌ మాట్లాడుతూ సిఎంగా ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేసి అన్ని వర్గాల ప్రజలను సంతృప్తిపరచారని, ఆయన నాయకత్వాన్ని బలపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కొమ్మా శ్రీనివాసరావు, కోసూరి చండీప్రియ, పార్టీ నాయకులు తెలుగు మహిళ రాష్ట్ర కార్యదర్శి కొయ్యాన కుమారి, కురగంటి సతీష్‌, మజ్జి రాంబాబు, శెట్టి జగదీష్‌, మద్ది నారాయణరావు, మాటూరి సిద్దార్ధ, తమ్మన గోపాలకృష్ణ, కేదారశెట్టి గోవింద్‌,తవ్వా రాజా, హుస్సేన్‌ ఆలీ జానీ, మండవల్లి శివ, మెహబూబ్‌ ఖాన్‌,పుట్టా సాయిబాబు,నల్లం ఆనంద్‌, పిన్నింటి రవిశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here