చంద్రబాబు పాలనకు ప్రజలు జేజేలు

0
275
జన చైతన్యయాత్రలు విజయవంతం కావడమే నిదర్శనం
నగరంలో ముగిసిన తెదేపా జన చైతన్య యాత్రలు
రాజమహేంద్రవరం, నవంబర్‌ 27 : రెండున్నరేళ్ళ కాలంలో సిఎం చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాలు ఏరీతిలో అందుతున్నాయో తెలుసుకునేందుకు చేపట్టిన జనచైతన్య యాత్రలకు ప్రజలు బ్రహ్మరధం పట్టారని, హారతులిచ్చి స్వాగతించారని రూరల్‌ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. రాజమహేంద్రవరంలో చేపట్టిన జనచైతన్య యాత్ర ముగింపు కార్యక్రమంలో స్ధానిక 42వ డివిజన్‌లో కార్పొరేటర్‌ మళ్ళ నాగలక్ష్మి వెంకట్రాజు ఆధ్వర్యంలో నిన్న సాయంత్రం జరిగింది. ముందుగా పార్టీ పతాకాన్ని గోరంట్ల ఆవిష్కరించారు. అనంతరం ఎన్‌టిఆర్‌, గన్ని సత్యనారాయణమూర్తి విగ్రహాలకు పూలమాలలువేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గన్ని కృష్ణ, ఎంఎల్‌సి ఆదిరెడ్డి అప్పారావు, కాపు కార్పొరేషన్‌ డైరెక్టర్‌ యర్రా వేణుగోపాలరాయుడు, డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు, ఆర్యాపురం బ్యాంక్‌ ఛైర్మన్‌ చల్లా శంకరరావు, ఫ్లోర్‌లీడర్‌ వర్రే శ్రీనివాసరావు, దళితరత్న కాశి నవీన్‌కుమార్‌, పార్టీ సీనియర్‌ నాయకులు యేలూరి వెంకటేశ్వరరావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పరిపాలన పారదర్శకంగా జరుగుతుందని, పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తున్నారని అన్నారు. రుణాలు మాఫీతోపాటు సకాలానికే పింఛన్లు పంపిణీ చేయడం, కాపు, బ్రాహ్మణ, ఇతర కులాలలోని పేదలను ఆదుకోవడానికి కార్పొరేషన్‌లను ఏర్పాటుచేసి రుణాలు అందిస్తున్నారన్నారు. రాజధాని నిర్మాణం, పట్టిసీమ ఎత్తిపోతల పధకం, పోలవరం ప్రాజెక్టు, ఇతర ప్రాజెక్టులను పూర్తి చేస్తున్న తరుణంలో ప్రతిపక్ష నాయకుడు జగన్‌ అడ్డుపడుతూ బురదజల్లుతున్నాడని మండిపడ్డారు. ఆర్ధిక లోటున్నా సంక్షేమ పధకాలను అమలుచేస్తున్న చంద్రబాబు పాలనను ప్రజలు ఆలోచించాలని కోరారు. సభ్యత్వ నమోదులో 42 డివిజన్‌ అగ్రస్ధానంలో నిలిచిందని, తమ జనచైతన్య యాత్ర ముగింపును వైభవంగా నిర్వహించారని అభినందించారు. ఈ డివిజన్‌లో రైతు బజారు ఏర్పాటు చేయడం, మున్సిపల్‌ కాలనీలో పార్కు నిర్మాణం చేపడతామన్నారు. గన్ని కృష్ణ మాట్లాడుతూ తెలుగుదేశం అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడూ ప్రజాపక్షమేనని అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కారం కోసం చేపట్టిన జనచైతన్య యాత్రలు విజయవంతంగా ముగిసాయని చెప్పారు. 2007 ఎన్నికల్లో మళ్ళ వెంకట్రాజు ఓటమి పాలైనా, నిరుత్సాహ పడకుండా ప్రజల పక్షాన నిలవడం వల్లే 2014 ఎన్నికల్లో తన భార్యను గెలిపించుకోగలిగాడని చెప్పారు. ప్రతిపక్షాలు జనచైతన్య యాత్రపై దుష్ప్రచారం చేసినప్పటికీ చంద్రబాబు కృషికి ప్రజలు హారతులిచ్చి స్వాగతించారని తెలిపారు. ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ పార్టీ శ్రేణులు ప్రజలతో మమేకం కావాలని ఉద్దేశించి జనచైతన్య కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. యర్రా వేణుగోపాలరాయుడు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ మరోవైపు రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు కృషిచేస్తున్నారని కొనియాడారు. వాసిరెడ్డి రాంబాబు, చల్లా శంకరరావు, యేలూరి వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ తెలుగుదేశం ఎప్పుడూ పేద ప్రజల అభ్యన్నతికి కృషిచేస్తుందన్నారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిధులను, పార్టీ శ్రేణులను, కార్పొరేటర్‌లను, వికలాంగులైనా జనచైతన్య యాత్రలలో చురుగ్గా పాల్గొన్న కంచుపాటి గోవిందు, ఇంజమూరి సత్యనారాయణలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌లు కడలి రామకృష్ణ, పెనుగొండ విజయభారతి, పితాని లక్ష్మికుమారి, కోరుమెల్లి విజయశేఖర్‌, చంఢీప్రియ, రెడ్డి పార్వతి, మాటూరి రంగారావు, గగ్గర సూర్యనారాయణ, మర్రి దుర్గాశ్రీనివాస్‌, యిన్నమూరి రాంబాబు, పల్లి శ్రీనివాస్‌, బూరా దుర్గాంజనేయరావు, పాలవసల వీరభద్రం, గరగ పార్వతి, కొమ్మ శ్రీనివాస్‌, గాదిరెడ్డి బాబులు, మానుపాటి తాతారావు, కోఆప్సన్‌ సభ్యులు మజ్జి పద్మ, కప్పల వెలుగుకుమారి, ఛాన్‌బాషా, పార్టీ నాయకులు రెడ్డి మణి, కురగంటి సతీష్‌, ఎం బ్రహ్మయ్య, ఉప్పులూరి జానకీరామయ్య, అరిగెల బాబూనాగేంద్రప్రసాద్‌, ఉస్సేన్‌ అలీజానీ, ఎస్‌ రాజరావు, చిట్టూరి ప్రవీణ్‌చౌదరి, తలారి భాస్కర్‌, పితాని కుటుంబరావు, ఆచంట బాలాజీ, జక్కంపూడి అర్జున్‌, వంకా శ్రీనివాస్‌చౌదరి, షేక్‌ సుభాన్‌, నమ్మి నాగశేఖర్‌, పెయ్యల శ్రీను, సూరంపూడి శ్రీహరి, శీలం గోవిందు, బిక్కిన రవికిశోర్‌, అక్కు, కోట కామరాజు, మొల్లి చిన్నియాదవ్‌, జాలా మదన్‌, రంధి శ్రీనివాస్‌, జాగు వెంకటరమణ, వానపల్లి శ్రీనివాస్‌, వానపల్లి సాయిబాబా, శనివాడ అర్జున్‌, సైదుబాబు, పిన్నింటి రవిశంకర్‌, ఎంఎ రషీద్‌, కొమ్మిరెడ్డి పెద్దకాపు, మొండి సత్యనారాయణ, జల్లి హేమలత, పేరూరి అంజి, అనుపోజు ప్రసాద్‌, అరసాడ వంశీకృష్ణ, చోడిశెట్టి ఉమామహేష్‌, ఎం సుగుణ, భైరవ తదతరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 42వ డివిజన్‌ కమిటీ సభ్యులను ఘనంగా సత్కరించారు.