చంద్రబాబు మళ్ళీ సీఎం కాకుంటే రాష్ట్ర భవితవ్యం అగమ్య గోచరమే

0
318
 ఓర్వలేకే జగన్‌, పవన్‌ ఆరోపణలు -నగర దర్శినిలో గన్ని, ఆదిరెడ్డి
రాజమహేంద్రవరం, ఆగస్టు 2  : రాష్ట్రాన్ని అభివ ద్ధి, సంక్షేమంలో ముందుకు నడిపిస్తున్న చంద్రబాబునాయుడుని తిరిగి ముఖ్యమంత్రిగా ఎన్నుకోకపోతే రాష్ట్రం అంధకారమయంగా మారిపోతుందని గుడా చైర్మన్‌ గన్ని క ష్ణ, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. స్ధానిక 29 డివిజన్‌లో ఈరోజు కో ఆప్షన్‌ సభ్యురాలు మజ్జి పద్మ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నగర దర్శిని కార్యక్రమం రెండోరోజు కొనసాగించారు. ఈ సందర్భంగా రౌతు తాతాలు కళ్యాణ మండపంలో నిర్వహించిన పార్టీ సమావేశంలో గుడా చైర్మన్‌ గన్ని క ష్ణ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల నాటికి అర్హులైన ప్రతి ఒక్కరికి గ హాలు మంజూరు చేయడమే లక్ష్యంగా సిఎం చంద్రబాబు క షి చేస్తున్నారని, గత ప్రభుత్వాల మాదిరిగా లబ్దిదారుల ఎంపికలో అవకతవకలకు తావు లేకుండా పారదర్శకంగా జరుగుతుందన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రవేశపెట్టిన చంద్రన్న బీమా ద్వారా ఈ డివిజన్‌లో రూ.49 లక్షలు అందించడం జరిగిందన్నారు. ఇటీవల పవన్‌ కళ్యాణ్‌ ఫ్లెక్స్‌ కడుతూ చనిపోయిన యువకునికి చంద్రన్న బీమా ద్వారా రూ.5 లక్షలు అందించామన్నారు. అన్న క్యాంటీన్ల నిర్వాహణపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారని, క్రమం తప్పకుండా ప్రతి నెల ఫించన్లు అందిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు పాలనను, ఆయనకు ప్రజల్లో వస్తున్న స్పందన చూసి ఓర్వలేక జగన్‌, పవన్‌లు మాయ మాటలతో అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్‌ ఇస్తున్న హామీలు అమలు చేయాలంటే ఢిల్లీని అమ్మినా సరిపోదని ఎద్దేవా చేసారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మాత్రం నిత్యం ప్రజల్లోనే ఉందని, రాజకీయాల్లో మార్పులు తెచ్చేందుకు సిఎం చంద్రబాబు క షి చేస్తున్నారని అన్నారు. ప్రతి ఇంటికి పెద్ద కొడుకులా అందరి కష్టాలను తీర్చేందుకు వివిధ  పథకాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.రాష్ట్ర ప్రగతే ధ్యేయంగా పని చేస్తున్న చంద్రబాబు నాయకత్వాన్ని బలపరచాలని కోరారు. శాప్‌ డైరెక్టర్‌ యర్రా వేణుగోపాలరాయుడు మాట్లాడుతూ సిఎం చంద్రబాబు సంక్షేమ పాలనకు ప్రజలు సంత ప్తిగా ఉన్నారని, పూర్తి స్ధాయిలో అందరూ ఆనందంగా ఉండాన్న సంకల్పంతో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యాపురం బ్యాంక్‌ చైర్మన్‌ చల్లా శంకర్రావు, నగర పార్టీ అధ్యక్షుడు వాసిరెడ్డి రాంబాబు, పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి వాసు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కురగంటి సతీష్‌, బుడ్డిగ రాధా, చవ్వాకుల రంగనాధ్‌, కడితి జోగారావు, లంక వీరబాబు, కర్రి రాంబాబు, మెహబూబ్‌ ఖాన్‌, అట్టాడ రవి, చించినాడ తాతాజీ, ముత్య సత్తిబాబు, మజ్జి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here