చంద్రబాబు, లోకేష్‌ల చిత్రపటాలకు పాలాబిషేకం

0
190
కార్పొరేషన్‌ ఏర్పాటుపై పాలిక శ్రీను ఆధ్వర్యంలో సంబరాలు
రాజమహేంద్రవరం, జనవరి 29 : గౌడ,శెట్టిబలిజ, ఈడిగ, శ్రీశయన, యాత కులస్తులందరికి కలిసి ఒక ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జయ¬ బిసిలో ప్రకటించడంపై గౌడ,శెట్టిబలిజ, ఈడిగ, శ్రీశయన యాత సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పాలిక శ్రీను ఆధ్వర్యంలో సంబరాలు జరిపారు. రామకృష్ణధియెటర్‌ సెంటర్‌ నుండి వై.జంక్షన్‌లోని గౌతు లచ్చన్న విగ్రహం వరకు  ఊరేగింపుగా వెళ్లారు. అక్కడ గౌతు లచ్చన్న విగ్రహం వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్‌ చిత్రపటానికి పాలాబిషేకం జరిపారు.  ప్రత్యేక కార్పొరేషన్‌  ఏర్పాటుకు గౌడ,శెట్టిబలిజ, ఈడిగ, శ్రీశయన, యాగ సంక్షేమసంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొనగళ్ల నారాయణ, ఉపముఖ్యమంత్రి  కె.ఇ. కృష్ణమూర్తి, మంత్రి పితాని సత్యనారాయణ, శాసనమండలి ఇన్‌చార్జి చైర్మన్‌ రెడ్డి  సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌లు ఎంతగానో సహకరించారని పాలిక శ్రీను ఈ సందర్బంగా తెలిపారు. కులస్తుల సంక్షేమానికి సంఘం నాయకులు చేసిన కృషి గొప్పదన్నారు. సంఘం నాయకుల విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సానుకూలంగా స్పందించి కార్పొరేషన్‌ ఏర్పాటు చేయడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నగర అధ్యక్షుడు రెడ్డి రాజు, జిల్లా అధికార ప్రతినిధి, ఆర్యాపురం బ్యాంక్‌ డైరెక్టర్‌ సూరంపూడి శ్రీహరి,నాయకులు గుత్తుల రామచంద్రరావు, గుత్తుల దుర్గారావు,బుడ్డిగ రవి, బుడ్డిగ శ్రీను, పిల్లి చిన్నోడు.దారా అన్నవరం, సూరంపూడి అప్పారావు, సి.వి.రామచంద్రరావు, పిల్లి బుజ్జి, పిల్లి ఏడుకొండలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here