చట్టసభల్లోనూ మాదిగలకు ప్రాధాన్యమివ్వాలి

0
131
తెదేపా ఎస్సీ సెల్‌ అధ్యక్షునిగా రాజు నియామకంపై ఎంఆర్‌పిఎస్‌ హర్షం
రాజమహేంద్రవరం, జనవరి 19 : ఎపి ఎంఆర్‌పిఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎంఎస్‌ రాజును తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్‌ అధ్యక్షునిగా నియమించడం పట్ల ఎపి ఎంఆర్‌పిఎస్‌ జిల్లా కమిటీ హర్షం వ్యక్తం చేసింది. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఈరోజు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎపి ఎంఆర్‌పిఎస్‌ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మల్లవరపు వెంకటరావు మాదిగ, జిల్లా ఇన్‌ఛార్జి అధ్యక్షులు పిప్పర సంపదరావు మాదిగ, జిల్లా యువసేన అధ్యక్షులు మందపల్లి రాజు మాదిగా, రెల్లి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొచ్చ యేసు రెల్లిలు మాట్లాడారు. ఎపి ఎంఆర్‌పిఎస్‌ ప్రాతినిధ్య అంశాలను అమలుపరుస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. డప్పు కళాకారులకు, చర్మ కారులకు, బుడగ జంగాలకు పింఛన్లు అందించడం పట్ల ధన్యవాదాలు తెలియజేశారు. మాదిగ, మాదిగ అనుబంధ కులాలకు ఉపయోగపడే అనేక పధకాలను ఎంఆర్‌పిఎస్‌ సాధించిందని వారు పేర్కొన్నారు. ప్రభుత్వం సంక్షేమం పరంగా కొంత చేస్తున్నప్పటికీ రాజకీయ పరంగానూ మాదిగలకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందన్నారు. జిల్లాలో ఎమ్మెల్యే సీటు గానీ, ఎమ్మెల్సీ సీటును గానీ మాదిగలకు కేటాయించాలని కోరారు. రెల్లిలకు కూడా పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని బొచ్చ యేసు రెల్లి కోరారు. విలేకరుల సమావేశంలో డప్పు కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు పెనుమాకుల వినయకుమార్‌ మాదిగ, ఎంఆర్‌పిఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జొన్నమాటి భాస్కరమాదిగ, రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గం ఎంఆర్‌పిఎస్‌ అధ్యక్షులు చంద్రమళ్ళ మణికుమార్‌ మాదిగ, మండపేట నియోజకవర్గం ఇన్‌ఛార్జి మోరంపూడి అప్పలస్వామి, యువసేన జిల్లా ఇన్‌ఛార్జి సురేష్‌ మాదిగలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here