చట్టాలను కఠినం చేయాలి… దోషులను శిక్షించాలి

0
121
యువతి హత్యాచారంపై సిటీ ఎమ్మెల్యే భవాని
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 2 : హైదరాబాద్‌లో కామాంధుల చేతుల్లో అత్యాచారానికి గురై ఓ యువతి హత్యకు గురి కావడం పట్ల రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ  ఒక ప్రకటనలో తన విచారం వ్యక్తం చేశారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించి వారిని అతి  కిరాతకంగా హత్య చేస్తున్న వారిని చట్టాలను కఠిన తరం చేసి కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్‌ చేశారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ మహిళలను వేధించిన సంఘటనలు చాలానే జరిగాయని, ఇటువంటి సంఘటనలు చేసిన సమయంలో అప్పటి ప్రభుత్వాలు స్పందించి చట్టాలు చేస్తున్నాయే తప్ప వాటిని కఠినంగా అమలు చేయకపోవడం వల్లే అటువంటి సంఘటనలు పునరావ త్తం అవుతున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ మళ్లీ జరుగుతున్నాయంటే చట్టాల్లో లోపమా… లేక ప్రభుత్వాల్లో లోపమా అనేది ప్రశ్నించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. అత్యాచారం చేసి… అతి క్రూరంగా హత్య చేసిన వారిని ఊరికే వదిలేయకుండా… భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు… అలాగే ఆ ఆలోచనలు వచ్చే వారికి గుర్తుండిపోయేలా దోషులను శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here