చలో గుంటూరుకు భారీగా తరలి వెళ్ళిన మైనార్టీలు 

0
428
రాజమహేంద్రవరం, ఆగస్టు 28  : గుంటూరులో ఈరోజు ఏర్పాటు చేసిన ‘నారా హమారా.. టీడీపీ హమారా..’ కార్యక్రమానికి రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం నుండి 11 బస్సుల్లో 600 మంది మైనారిటీలు స్థానిక తిలక్‌రోడ్‌లోని ఎం.ఎల్‌.సి. ఆదిరెడ్డి అప్పారావు నివాసం నుండి ఈ ఉదయం బయలుదేరి వెళ్ళారు. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, చల్లా శంకర్రావు, రెడ్డి మణేశ్వరరావు, యువ నాయకులు ఆదిరెడ్డి వాసు జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎం.ఎల్‌.సి.ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ ముస్లింల సంక్షేమానికి తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న అభివ ద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు గతంలో మరే ప్రభుత్వం చేపట్టలేదని, మైనారిటీల సంక్షేమానికి 2018-19 బడ్జెట్లో రూ. 1101.90 కోట్లు కేటాయించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుదే నన్నారు. చంద్రన్న పెళ్లికానుకగా అందిస్తున్న దుల్హన్‌ పథకం కింద ముస్లిం నవ వధువులకు రు.50 వేలు అందిస్తున్నారని, 2018-19లో ఈ ఫధకానికి రు.80 కోట్లు కేటాయించారని,దీని వలన పదహారు వేల మందికి ప్రయోజనం చేకూరుతుందన్నారు.చరిత్రలో తొలిసారిగా ఇమామ్లకు, మౌజన్లకు పారితోషికం ప్రవేశపెట్టిన ఘనత కూడా సి.ఎం. చంద్రబాబు నాయుడు దేనని,విభజన తరువాత ఏపీ లోని ముస్లింల కోసం విజయవాడలో రు.80 కోట్లతో, కడపలో రు.12 కోట్లతో హజ్‌ హౌస్‌లను ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్మిస్తున్నారని, అలాగే రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో 3 కోట్ల 25 లక్షల రూపాయలతో మసీదులు, షాదీఖానాలు,ఈద్గాలు అభివ ద్ధి చేస్తున్నారని,  అటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మైనార్టీలంతా మద్దతివ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం నాయకులు షేక్‌ సుభాన్‌, ఛాన్‌ భాషా, హాబీబుల్లా ఖాన్‌, మహబూబ్‌ ఖాన్‌, మహబూబ్‌ జానీ, అప్సరి, మదీని, షేక్‌ సుభాని,ఇలియాజ్‌,రబ్బానీ, జానీ, హుస్సేన్‌, టీడీపీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here