చాంబర్‌లో నామినేషన్ల కోలాహలం 

0
171
రెండు బెల్టులుగా పోటీకి సిద్ధపడుతున్న పలువురు వర్తక ప్రముఖులు
మద్ధతు పలుకుతున్న ప్రధాన రాజకీయ పార్టీలు : ఎవరికీ మద్ధతు ఇవ్వని జనసేన
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 21 : ప్రతిష్టాత్మకమైన ది రాజమండ్రి చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఎన్నికల్లో భాగంగా ఈరోజు  నామినేషన్ల ప్రక్రియ కోలాహలంగా ప్రారంభమైంది. రెండు బృందాలుగా అభ్యర్ధులు చాంబర్‌ కార్యాలయానికి చేరుకుని తమ నామినేషన్ల పత్రాలను దాఖలు చేశారు. అంతకు ముందు అభ్యర్ధులు తమ మద్ధతుదారులతో నాళం భీమరాజు వీధిలోని శ్రీ సిద్ధి వినాయక ఆలయంలో పూజలు చేశారు.  ఈ ఎన్నికల్లో ప్రస్తుతం అధ్యక్ష పదవికి లక్ష్మీనారాయణ జవ్వార్‌, ఉపాధ్యక్ష పదవికి మండవిల్లి శివన్నారాయణ(శివ), ఒంటెద్దు సూరిబాబు,కాలెపు వెంకట వీరభద్రరావు, క్షత్రియ బాలసుబ్రహ్మణ్య సింగ్‌, గౌరవ కార్యదర్శి పదవికి  మద్దుల మురళీకృష్ణ, యిన్నమూరి రాంబాబు, సంయుక్త కార్యదర్శుల పదవులకు లక్కోజు వీరభద్రరావు,వెత్సా వెంకట సుబ్రహ్మణ్యం (బాబ్జీ), కోశాధికారి పదవికి లక్కోజు వీరభద్రరావు, బలభద్ర వీర్రాజు, మజ్జి రాంబాబు తమ నామినేషన్లు దాఖలు చేశారు. మధ్యాహ్నం 2 గంటల సమయానికి డైరక్టర్ల పదవులకు 31 మంది, ట్రస్ట్‌ బోర్డు డైరక్టర్ల పదవులకు ఎనిమిది మంది నామినేషన్లను చాంబర్‌ కార్యాలయంలో అందజేశారు. అంతకు ముందు చాంబర్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్న యిన్నమూరి  శ్రీరామచంద్రమూర్తి, మండవిల్లి శివ, క్షత్రియ బాల సుబ్రహ్మణ్య సింగ్‌, మజ్జి రాంబాబు, ఇతర పదవులకు పోటీ చేస్తున్న వారికి మద్ధతుగా మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, శాప్‌ మాజీ డైరక్టర్‌ యర్రా వేణుగోపాలరాయుడు,ప్రస్తుత చాంబర్‌ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు, మాజీ కార్పొరేటర్‌ కురగంటి సతీష్‌, రొబ్బి విజయశేఖర్‌, మాటూరి రంగారావు, యిన్నమూరి దీపు, బూరాడ భవాని శంకర్‌, శెట్టి జగదీష్‌,  మద్ది నారాయణరావు, సత్తి వెంకట సాయి సందీప్‌,మాటూరి సిద్ధార్ధ, నామన శ్రీకాంత్‌, మండవిల్లి హరనాథ్‌, మానే దొరబాబు, బెజవాడ రాజ్‌కుమార్‌, మజ్జి శ్రీనివాస్‌, కర్రి రాంబాబు తదితరులు నామినేషన్ల ప్రక్రియలో పాల్గొన్నారు. సిద్ధి వినాయక ఆలయంలో జరిగిన పూజల్లో గుడా మాజీ చైర్మన్‌ గన్ని కృష్ణ పాల్గొని పోటీ చేస్తున్న అభ్యర్ధులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇలా ఉండగా మరో బెల్ట్‌గా పోటీ చేస్తున్న లక్ష్మీనారాయణ జవ్వార్‌, మద్దుల మురళీకృష్ణ తదితరులకు రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సిటీ కో ఆర్డినేటర్‌ శ్రిఘాకొళ్ళపు శివరామసుబ్రహ్మణ్యం, రూరల్‌ కో ఆర్డినేటర్‌, చాంబర్‌ పూర్వాధ్యక్షులు ఆకుల వీర్రాజు, చాంబర్‌ పూర్వాధ్యక్షులు బొమ్మన రాజ్‌కుమార్‌, నందెపు శ్రీనివాస్‌, పొలసానపల్లి హనుమంతరావు, అశోక్‌కుమార్‌ జైన్‌, బూర్లగడ్డ సుబ్బారాయుడు, కొల్లేపల్లి శేషయ్య, సిసిసి ఎండి పంతం కొండలరావు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మేడపాటి షర్మిళారెడ్డి, బిజెపి నాయకులు యెనుముల రంగబాబు తదితరులు వారికి మద్ధతు తెలిపారు.
చాంబర్‌ ఎన్నికల్లో ఎవరికీ మద్ధతు ఇవ్వడం లేదు: జనసేన
చాంబర్‌ ఎన్నికల్లో జనసేన పార్టీ ఎవరికీ మద్ధతు ఇవ్వడం లేదని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి కందుల దుర్గేష్‌, నగర ఇన్‌ఛార్జి అత్తి సత్యనారాయణ పేర్కొన్నారు. తమ మద్ధతు ఇస్తున్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని వారు ఖండించారు. రాబోయే స్ధానిక సంస్థల ఎన్నికల నిమిత్తం పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకు వెళుతున్నామని వారు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here