చింతమనేని వ్యాఖ్యలపై న్యాయవాదుల ఆందోళన

0
153
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 26 : దళితులను కించపర్చేలా వ్యాఖ్యలు చేసిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను అరెస్టు చేయాలని రాజమండ్రి బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. చింతమనేని వ్యాఖ్యలను నిరసిస్తూ బార్‌ అసోసియేషన్‌ సభ్యులు మంగళవారం విధులను బహిష్కరించారు. బార్‌ అసోసియేషన్‌ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించి గోకవరం బస్టాండు సెంటర్‌ సమీపంలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద చింతమనేని దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం త్రీ టౌన్‌ పోలీసు స్టేషన్‌ వ్ద మానవహరం నిర్వహించి, చింతమనేనిని తక్షణమే అరెస్టు చేసి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద అరెస్టు చేయాలని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు కె.లక్ష్మీనారాయణ, గొందేటి శ్రీనివాసులు రెడ్డి, ఎం.శ్రీనివాస్‌, ముప్పాళ్ళ సుబ్బారావు, కాశి శ్రీనివాసరావు, కెఎల్‌ భవాని, బి.దివాకర్‌, వేళంగి చిట్టిబాబు, సాకా సురేష్‌బాబు, విల్సన్‌, నక్కా హరిబాబు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here